Covid-19 Latest Updates: మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఈ ప్రాంతాల్లో ఆంక్షలు

Corana Cases in India: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,109 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మాస్క్‌లు, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 01:21 PM IST
Covid-19 Latest Updates: మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఈ ప్రాంతాల్లో ఆంక్షలు

Corana Cases in India: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. వరుసగా రెండో రోజు కూడా పది వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 11,109 కొత్త కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 49622కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.01 శాతం. మొత్తం కేసుల సంఖ్య 4,42,16,583గా ఉంది. యాక్టివ్ కేసుల 0.11 శాతం ఉండగా.. రికవరీ రేటు ప్రస్తుతం 98.70 శాతం ఉంది. గత 24 గంటల్లో 6,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 20 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 2,21,725 మందికి కరోనా ​​పరీక్షలు నిర్వహించగా.. మొత్తం కోవిడ్ టెస్టుల సంఖ్య 92.37 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు.
 
కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాల్లో ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. మాస్క్ ధరించడంంతో సామాజిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్‌లలో కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నోయిడాలో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది. నోయిడాలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్‌ పాటించాలని అధికారులు కోరుతున్నారు. అన్ని ప్రదేశాలలో మాస్క్ ధరించడంతోపాటు శానిటైజర్‌తో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. 

పాఠశాలలు, కార్యాలయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్లు ఏర్పాట్లు చేయాలని నోయిడాలో ప్రభుత్వం ఆదేశించింది. జలుబు, జ్వరం లక్షణాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని.. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తోంది. అనుమానం ఉంటే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరుతోంది. పాఠశాలలు, కళాశాలలలో  విద్యార్థులు మాస్కులు ధరించేలా చేయాలని చెబుతోంది. పాఠశాలల్లోకి ప్రవేశించే స్టూడెంట్స్ ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. విద్యార్థుల్లోకి ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే పాఠశాలలు, కాలేజీలకు పంపించవద్దని తల్లిదండ్రులకు సూచించింది.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌ నగర ప్రజలకు ఉపశమనం.. ఒక్కసారిగా మారిన వాతావరణం  

ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సూచించారు. ప్రిస్క్రిప్షన్ కౌంటర్, టెస్ట్ కౌంటర్, మందుల పంపిణీ కేంద్రం వద్ద సామాజిక దూరం పాటించాలని కోరారు. రద్దీ ప్రదేశాలు, మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి. కిడ్నీ, గుండె, మధుమేహం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు బయటకు వెళ్లకూడదని కోరుతున్నారు. అదేవిధంగా ఘజియాబాద్ పాఠశాలల్లో కూడా మాస్క్‌లు తప్పనిసరి చేశారు. అన్ని పాఠశాలల్లో థర్మల్‌ స్కానింగ్‌ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్లాస్‌రూమ్ రెయిలింగ్‌లు, స్వింగ్‌లు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది. 

Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News