Home Isolation Guidelines: కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో హోం ఐసోలేషన్ కేసులే అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐసోలేషన్‌కు సంబంధించిన నూతన గైడ్‌లైన్స్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) రౌద్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకూ అత్యధిక స్థాయిలో నిన్న 3 లక్షల 79 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 83 లక్షల 76 వేల 524కు చేరుకుంది.యాక్టివ్ కేసులు దేశంలో ప్రస్తుతం 30 లక్షలు దాటి ఉన్నాయి. కోవిడ్ తొలి దశతో పోలిస్తే రెండవ దశలో హోం ఐసోలేషన్ (Home Isolation)కేసులు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ నేపధ్యంలో కోవిడ్ బారినపడి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న బాథితులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ( Central government )నూతన గైడ్‌లైన్స్( New Guidelines) జారీ చేసింది.
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు తప్పనిసరిగా ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ ధరించాల్సి ఉంటుంది. 8 గంటల వాడకం తరువాత ఆ మాస్క్‌ను పడవేసి..మరో మాస్క్ ధరించాలి. అదే విధంగా హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి వద్దకు ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తే బాధితుడు, కుటుంబసభ్యులు ఇద్దరూ ఎన్ 95 మాస్క్ ధరించాలి. ధరించిన మాస్క్ పడవేసేటప్పుడు 1 శాతం సోడియం హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారం చేయాలి. కరోనా (Covid virus) బారిన పడినవారు తగినంత విశ్రాంతి, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం చేయాలని సూచిస్తోంది.
Also read: Lockdown: దేశంలో ఏయే రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది, ఏపీ-తెలంగాణ పరిస్థితేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook