మోదీ మళ్లీ ప్రధాని కావడానికి ఆ ఒక్కటి చాలు: యోగి ఆదిత్యనాథ్

బాలాకోట్ దాడులే మోదీని మళ్లీ ప్రధానిని చేస్తాయన్న యోగి

Last Updated : Mar 12, 2019, 11:58 PM IST
మోదీ మళ్లీ ప్రధాని కావడానికి ఆ ఒక్కటి చాలు: యోగి ఆదిత్యనాథ్

లక్నో: పుల్వామా దాడులకు ప్రతీకారంగా ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ వద్ద జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన వైమానిక దాడులే 2019 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. భారత వాయుసేన జరిపిన దాడులను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు సైనికులు, అమరవీరుల త్యాగాలను కించపరిచేలా వ్యవహరించాయని.. కానీ అవే బాలాకోట్ దాడులు ప్రధాని మోదీకి మళ్లీ యోగి పట్టం కట్టేలా చేస్తాయని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. తన ట్టిటర్ ఖాతా ద్వారా ఓ కవితను నెటిజెన్స్‌తో పంచుకున్న ఆదిత్యనాథ్.. ఆ కవిత ద్వారా తన భావాలను తెలియజేశారు. 

ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 80 స్థానాలకుగాను 74 స్థానాల్లో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. 

Trending News