Aryan Khan: ఆర్యన్‌కు రూ.4,500 మనియార్డర్ చేసిన షారుక్​ కుటుంబం..ఎందుకో తెలుసా?

Aryan Khan: డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్‌ఖాన్‌కు జైలులో క్యాంటీన్‌ ఖర్చుల కోసం రూ.4,500 రూపాయలను వాళ్ల కుటుంబీకులు జైలుకు మనియార్డర్‌ చేశారు. అక్టోబర్ 11న షారుక్​ కుటుంబం మనియార్డర్ చేసినట్లు వెల్లడించారు జైలు సూపరింటెండెంట్‌ నితిన్ వేచల్.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2021, 02:50 PM IST
Aryan Khan: ఆర్యన్‌కు రూ.4,500 మనియార్డర్ చేసిన షారుక్​ కుటుంబం..ఎందుకో తెలుసా?

Aryan Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్​ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు(Aryan Khan Arrest) జైలులో క్యాంటీన్‌ ఖర్చుల కోసం రూ.4,500 రూపాయలను వాళ్ల కుటుంబీకులు జైలుకు మనియార్డర్‌ చేశారు(shahrukh khan son bail). డ్రగ్స్‌ కేసు(Drugs Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్‌ ప్రస్తుతం ముంబయిలో అర్థర్‌రోడ్‌ చెరసాల(Arthur Road prison)లో ఉన్నాడు. 

ఖైదీ నంబర్ N956

అక్టోబర్ 11న షారుక్​ కుటుంబం మనియార్డర్(Moneyorder) చేసినట్లు తెలిపారు జైలు సూపరింటెండెంట్‌ నితిన్ వేచల్. జైలు నిబంధనల ప్రకారం చెరసాల లోపలున్న వారు ఖర్చుల కోసం గరిష్టంగా 4,500 రూపాయల మనియార్డర్‌ పొందవచ్చని వెల్లడించారు. కాగా ఆర్యన్ ఖాన్‌కు ఖైదీ నంబర్ N956 కేటాయించినట్లు తెలుస్తోంది. జైలులో ఖైదీలకు పెట్టే ఆహారాన్ని ఆర్యన్, అతడితో పాటు అరెస్ట్​ అయిన వాళ్లు తినట్లేదని సమాచారం. అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఆర్యన్ అయితే కేవలం నీళ్లు, బిస్కెట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. కరోనా పరీక్షల్లో ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్‌కు నెగెటివ్‌ రావడంతో సాధారణ సెల్‌కు తరలించారు. 

Also read: Tamil Nadu: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’..

అక్టోబర్‌ 3న గోవాకు చెందిన క్రూజ్‌ నౌకలో(Mumbai Rave Party) ఎన్సీబీ(NCB) అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్‌ ఖాన్‌, మూన్‌మూన్‌ ధామేచ, అర్బాజ్‌ మెర్చంట్‌ సహా ఎనిమిది మంది అరెస్ట్​ అయ్యారు. ఆర్యన్ బెయిల్‌ పిటిషన్‌(Aryan Bail petition)పై వరుసగా రెండో రోజు కూడా ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను మరోసారి వ్యతిరేకించారు ఎన్సీబీ తరపు న్యాయవాది. అయితే ఎన్పీబీ ఆరోపణలను ఆర్యన్‌ తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సెలబ్రిటీల పిల్లలైన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదని చట్టంలో ఎక్కడ లేదని కౌంటరిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును ఈనెల 20వ తేదీ వరకు రిజర్వ్‌లో పెట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News