జమ్మూకాశ్మీర్‌లో 450 మంది పాక్ ఉగ్రవాదులు

జమ్మూకాశ్మీర్‌లో 450 మంది పాక్ ఉగ్రవాదులు

Last Updated : Feb 8, 2019, 08:28 PM IST
జమ్మూకాశ్మీర్‌లో 450 మంది పాక్ ఉగ్రవాదులు

జమ్ము: జమ్మూకాశ్మీర్‌లో దాదాపు 450 మంది పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని భారత ఆర్మీ హెచ్చరించింది. పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సరిహద్దు రేఖ వెంబడి మొత్తం 16 ఉగ్రవాద శిబిరాలు పాక్ మద్దతుతో పనిచేస్తున్నాయని గురువారం ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. అందులోనూ పిర్ పంజల్‌కి ఉత్తరాన 300 మంది ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు ఆర్మీ తెలిపింది. 

పిర్ పంజల్‌కి దక్షిణాదిన 50 మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా ఉత్తరాది ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌‌బీర్ సింగ్ పేర్కొన్నారు. పిర్ పంజల్‌‌కి దక్షిణాదికన్నా ఉత్తరాదినే ఉగ్రవాదులు భారీ సంఖ్యలో వున్నందున అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా వున్నట్టు రణ్‌బీర్ సింగ్ తెలిపారు. గత ఆగస్టులో ఉగ్రవాద శిబిరాల్లో భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్ చోటుచేసుకున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Trending News