Vinesh Phogat Disqualified: భారత్‌కు భారీ షాక్‌.. ఓవర్‌ వెయిట్‌తో వినేష్‌ ఫోగట్‌ ఫైనల్‌ నుంచి అవుట్‌..!

Vinesh Phogat Disqualified From Final:  భారత్‌కు భారీ షాక్...  ఒలింపిక్సలో రెజ్లింగ్‌ విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఉదయం ఓవర్‌ వెయిట్‌ అనిపించడంతో అనర్హత వేటు వేశారు. దీంతో భారత్‌ పతకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written by - Renuka Godugu | Last Updated : Aug 7, 2024, 01:51 PM IST
Vinesh Phogat Disqualified: భారత్‌కు భారీ షాక్‌.. ఓవర్‌ వెయిట్‌తో వినేష్‌ ఫోగట్‌ ఫైనల్‌ నుంచి అవుట్‌..!

Vinesh Phogat Disqualified From Final: భారత్‌కు భారీ షాక్... రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ ఫైనల్‌ అర్హత కోల్పోయారు. మహిళల 50 కేజీల గోల్డ్‌ మెడల్‌ పోటీ‌ నుంచి ఆమె బయటకు రావాల్సి వచ్చింది. పారిస్‌ ఒలింపిక్సలో రెజ్లింగ్‌ విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఉదయం ఓవర్‌ వెయిట్‌ అనిపించడంతో అనర్హత వేటు వేశారు. దీంతో భారత్‌ పతకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని నివేదికల ప్రకారం వినేష్‌ ఫోగట్‌ 50 కేజీల మహిళల విభాగంలో పోటీ పడటానికి ఉండాల్సిన బరువు కంటే కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉండటంతో ఆమెపై ఈ అనర్హత వేటు పడింది. అదేవిధంగా ఫోగట్‌ కు రజత పతకం కూడా సాధించలేరు కాబట్టి ఇది భారత్‌కు ఊహించని షాక్‌ అని చెప్పాలి. ఒకవేళ ఆమె పోటీలో పాల్గొని ఓడిపోయినా పతకం లభించేది. అంతేకాదు ఫైనల్‌లో గెలిచి బంగారు పతకం సాధించినా భారత చరిత్రలో రికార్డు సృష్టించేవారు.

మంగళవారం పోటీ సమయంలో ఆమె పరిమిత బరువు ఉన్నారు. పోటీ రెండు రోజులు ఆమె బరువు పెరగలేదు కానీ, మంగవారం రెండు కేజీల బరువు పెరిగారు. దీంతో ఆమె ఆ బరువు తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. రాత్రంతా మేలుకొని జాగింగ్‌, స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ చేశారు. కానీ, నిర్ణీత బరువు కంటే ఆమె వంద గ్రాములు ఎక్కువగా ఉండటంలో ఓలింపిక్‌ క్రీడల సంఘం ఫోగట్‌ పై అనర్హత వేటు వేశారు.

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ భారత్‌ తరఫున చరిత్ర సృష్టిస్తుందనే 140 కోట్ల మంది భారతీయుల ఆశపై కేవలం 100 గ్రాముల ఓవర్‌ వెయిట్‌ నీరు చల్లినట్లయింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఆమె మన దేశంలోని లైంగిక వేధింపులపై ఓ పెద్ద యుద్ధమే చేశారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అయిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

వినేష్‌.. నువ్వు ఛాంపియన్‌ : ప్రధాని మోడీ స్పందన
వినేష్‌.. నువ్వు భారత్‌కు గర్వకారణం.. ఎంతో మందికి స్పూర్తిదాయకం, ఛాంపియన్లలో ఛాంపియన్‌, ఈరోజు ఈ ఎదురుదెబ్బ నిన్ను బాధిస్తుంది. ఎన్నో సవాళ్లను ఎదురొడ్డి నిలబడ్డావని మాకు తెలుసు. మళ్లీ బలంగా తిరిగి రండి.. మీకోసం ఎదురు చూస్తున్నాం.. అని ఎక్స్‌ వేధికగా వినేష్‌ ఫోగట్‌ను మెడీ ప్రశంసించారు. 

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News