World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 అలవాట్లు తప్పనిసరి!

World Health Day: 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మెరుగైన జీవితం కోసం ఆరోగ్యంగా ఉండడం తప్పనిసరి. కొన్ని మంచి అలవాట్ల వల్ల మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 12:08 PM IST
World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 అలవాట్లు తప్పనిసరి!

World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఏప్రిల్ 7న జరుపుకొంటారు. 1948 నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రతి సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. మెరుగైన జీవితం కోసం ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోతున్నారు. దీంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 అలవాట్లు చేసుకుంటే చాలు. 
మెరుగైన ఆరోగ్యం కోసం ఈ 5 అలవాట్లు..

1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ రోజువారీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది కాకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించడం మేలు.

2. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి

శరీరంలో నీటి కొరత రాకుండా ఉండటానికి, రోజుకు కనీసం 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలి. ఎందుకంటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఇలా చేయకుంటే డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శరీరంలోని మురికి చాలా వరకు తొలగిపోతుంది.

3. రోజులో సరైన నిద్ర

మీ రోజువారీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. దీంతో రోజంతా రిఫ్రెష్‌గా ఉండటమే కాకుండా టెన్షన్‌కు దూరంగా ఉంటారు. ఇలా చేయడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

4. క్రమం తప్పకుండా వ్యాయామం

మీరు ఫిట్‌గా ఉండాలంటే బెల్లీ ఫ్యాట్ పెరగకూడదనుకుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, జిమ్‌కి కూడా వెళ్లొచ్చు. 

5. మద్యం, సిగరెట్లు మానేయాలి

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు. మీరు దీనికి అలవాటు పడి ఉంటే, ఈరోజే దానిని మానేయండి. ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది.

(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికల ఆధారంగా సేకరించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదిస్తే మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)    

Also Read: Acidity Relief Remedies: ఎసిడిటీ సమస్యను దూరం చేసుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి!

Also Read: White Hair Treatment: తెల్లజుట్టు నల్లగా మారేందుకు ఈ 3 ఇంటి చిట్కాలను పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News