Superfoods: చలికాలంలో ఈ ఆకుకూరలో పోషకాలు డబుల్‌.. ఇది తింటే ఏ వైరస్‌ అయినా తోకముడవాల్సిందే..

Winter Green Superfoods: చలికాలంలో సీజనల్ జబ్బులు చుట్టుముడుతాయి. ఇమ్యూనిటీ బలహీన పడుతుంది అందుకోసమే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి ముఖ్యంగా కొన్ని కూరగాయలతోపాటు ఆకుకూరలు మన డైట్ లో చేసుకోవాలి. దీంతో మనకు శక్తి అందుతుంది అయితే ఈ సీజన్లో ఆకుకూరలు తక్కువగా పండుతాయి కాని వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి చలికాలం ఎలాంటి  ఆకుకూరలు చేర్చుకోవాలి తెలుసుకుందాం

Written by - Renuka Godugu | Last Updated : Jan 13, 2025, 11:30 AM IST
Superfoods: చలికాలంలో ఈ ఆకుకూరలో పోషకాలు డబుల్‌.. ఇది తింటే ఏ వైరస్‌ అయినా తోకముడవాల్సిందే..

Winter Green Superfoods: చలికాలంలో సీజనల్‌ జబ్బుల పడకుండా ఉండాలంటే.. వాటితో పోరాడటానికి కొన్ని ఆహారాలు తినాలి. ముఖ్యంగా ఆకుకూరలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆకు కూరల్లో ఈ సీజన్‌లో మరిన్ని పోషకాలు ఉంటాయి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి సీజనల్‌ జుబ్బులైనా మీనుంచి దూరంగా పారిపోతాయి.

కాలే..
కాలేలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది.. ఇది మన ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. కాలేలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మంట సమస్య, వాపును తగ్గిస్తుంది. అంతే కాదు మనకు ప్రాణాంతక వ్యాధుల నుంచి కాలే కాపాడుతుంది. దీన్ని కూర రూపంలో తీసుకోవచ్చు లేకపోతే సలాడ్‌గా చేసుకోవచ్చు.

పాలకూర..
పాలకూర ఇది సులభంగా దొరుకుతుంది. ఇందులో విటమిన్ కే, విటమిన్ ఏ ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే పాలకూరలు ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది.. అంతేకాదు పాకూరల ఆడవాళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలకూర తీసుకోవడం వల్ల ఎనిమియా సమస్య రాదు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇంకా పాలకూరను ఈ సీజన్లో డైట్ లో చేర్చుకోవడం వల్ల రోగాలు మన దరిచేరవు. పాలకూరతో కూర, పప్పు, స్మూతి చేసుకోవచ్చు.

మెంతి కూర..
మెంతి ఆకులు ఈ సీజన్లో తినాల్సిన మరో ఆహారం. ఇందులో కూడా ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి.. ఇది తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది. ఇందులో పోషక గుణాలు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మెంతికూర పప్పు కూడా తయారు చేస్తారు.

ఇదీ చదవండి: వైభవంగా భోగి సంబురాలు.. మంచుఫ్యామిలీ, రోజా కుటుంబం ఫోటోలు వైరల్‌..  

తోటకూర..
తోటకూర ఈ సీజన్లో మనం తప్పకుండా తినాల్సిన మరో ఆకుకూర. ఇందులో పొటాషియం, ఐరన్ ,కాల్షియం పుష్కలంగా ఉంటుంది. తోటకూర డైట్లో చేర్చుకోవడం వల్ల బీపీ స్థాయిలో అదుపులో ఉంటాయి. అంతేకాదు తోటకూర తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. డైటరీ ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు తోటకూర తినాలి.

ఇదీ చదవండి: బతుకు బండి బుగ్గి.. గుండెలవిసేలా ఏడ్చిన వంటలక్క, నిజం తెలిసినా నోరు విప్పని కార్తీక్‌..

కొలార్డ్ గ్రీన్స్‌..
కోలార్డు గ్రీన్సు వీటిని ఎక్కువ శాతం కాశ్మీర్లో తింటారు దీన్ని తెలుగులో దండలేని ఆకులను కూడా అంటారు ఇందులో విటమిన్ కే క్యాల్షియం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కోలార్ గ్రీన్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కోలార్ గ్రీన్స్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి చలికాలంలో తీసుకోవడం వల్ల మన శరీరాన్ని కావలసిన శక్తి ఇమ్యూనిటీ బలపడుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News