Foods To Control Bad Cholesterol: ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది!

Reduce Bad Cholesterol Naturally: ఆధునికజీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా తీవ్రమైన అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుల బారిన పడుతున్నవారి సంఖ్యం అధికంగా ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎలాంటి మందులు లేకుండా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 11:59 AM IST
Foods To Control Bad Cholesterol: ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది!

Reduce Bad Cholesterol Naturally: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు  వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం ఎంతో దృఢంగా ఉంటుంది. అయితే చాలా మంది అధిక కొవ్వు, మాంసకృత్తులు, పిండితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరుగుంది. దీని కారణంగా అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు.  అయితే ఈ చెడు కొలెస్ట్రాల్‌ సమస్యను తొలగించాలి అంటే మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇక్కడ చెప్పిన చిట్కాల వల్ల చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కొన్ని ఆహార పదార్థాలు సహాయపడుతాయి. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.

⭒ యాపిల్‌: ప్రతిరోజు మీ ఆహారంలో భాగంగా యాపిల్‌ తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ పండు రక్తంలోని కొలెస్ట్రాల్‌ తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

⭒  ద్రాక్ష: ద్రాక్ష పండుతో చేసిన జ్యూస్‌ లేద ద్రాక్ష పండు తినడం వల్ల టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంతేకాకుండా ద్రాక్షలోని పొటాషియం శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలిగిపోతాయి.

⭒ జామపండు: చెడు కొలెస్ట్రాల్‌ను తొలిగించడంలో జామపండు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, నికోటిన్‌ గుణాలు గుండెను సంరక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

⭒ ఓట్ మీల్: ఓట్స్‌లో పీచుపదార్థాలు అధికంగా లభిస్తాయి.దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

⭒ గింజలు: గింజలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధుల బారినపడకుండా సంరక్షిస్తుంది. గింజలు తీసుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ గుణాలు చెడ్డ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి.

Also Read: Saffron Benefits: పాలలో ఇది కలుపుకుని తాగితే అద్భుతమై అందంతో పాటు ఆరోగ్యం మీ సొంతం

⭒ సోయా: సోయాతో తయారు చేసిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఇందులోని టమిన్ బి3,బి6,ఇ  గుణాలు రక్త నుంచి కొలెస్ట్రాల్‌ను తొలిగించడంలో సహాయపడుతుంది. 

⭒ బీన్స్: బీన్స్ లో ఉండే  పీచు చెడ్డ కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది.దీనిలోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది.

⭒ వెల్లుల్లి: వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Also Read: Black Sesame Seeds: శీతాకాలంలో నల్ల నువ్వులతో బోలెడు లాభాలు..ముఖ్యంగా ఈ వ్యాధులున్నవారికి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News