Honey Facial Benefits: పకృతి నుంచి లభించే తేనె వినియోగంతో తో మెరిసే చర్మాన్ని పొందవచ్చు. దీంతో పాటు వడ దెబ్బ నుంచి కూడా మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా సమ్మర్ లో స్కిన్ కేర్ కోసం.. తేనెను ఫేషియల్ గా ఉపయోగించడం వల్ల మేలు జరుగుతుంది. మీ చర్మానికి మరింత గ్లో ఇవ్వడానికి సహాయపడుతుంది.
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు తేనె..
1. క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు!
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ చర్మంలో నిల్వ ఉన్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. దీని వల్ల మొటిమలు, చర్మంపై చికాకు వంటి సమస్యలను నివారించవచ్చు. అందుకోసం ముందుగా తేనె, నెయ్యిని కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అలా 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
2. ఫేస్ టోనర్ గా..
చర్మంపై ఉన్న రంధ్రాలను మూసేయడం సహా చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దోసకాయ, తేనె కలిపిన మిశ్రమంతో చర్మాన్ని మరితంగా మెరుపును తెస్తుంది. దీన్ని కాటన్ ప్యాడ్ సహాయంతో ముఖంపై రాసుకొని.. కొద్దిసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. స్క్రబర్ గానూ వినియోగం..
తేనె మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచేందుకు సహాయం చేస్తుంది. దీంతో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను నివారిస్తుంది. అందుకోసం ఓ గిన్నెలో తేనె, పంచదార వేసి బాగా కలపాలి. దీన్ని అప్లే చేసుకునే ముందు మీ ముఖాన్ని నీటితో కడగాలి. ఆ తర్వాత ముఖం, మెడపై సున్నితంగా మసాజ్ చేయాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి.
4. ఫేస్ ప్యాక్ కోసం..
ఫేస్ ప్యాక్ కోసం.. సగం అరటిపండును తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికి 1 టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడలోని అన్ని భాగాలకు పూయాలి. అలా 10 నిమిషాల తర్వాత మిశ్రమాన్ని నీటితో కడిగేయాలి.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Mango Benefits: రోజూ మామిడి పండు తినడం వల్ల ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు!
Also Read: Kidney Affecting Food: కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎట్టిపరిస్థితిలోనూ వీటిని తినకూడదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook