Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్

Honey-Turmeric Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఈ పదార్ధాల గురించి తెలుసుకుని వాడగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అటువంటిదే తేనె, పసుపు. ఈ రెండింటినీ కలిపి వాడితే ఏకంగా 5 రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 27, 2024, 05:15 PM IST
Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్

Honey-Turmeric Benefits: తేనె, పసుపు ప్రకృతిలో విరివిగా లభించే అద్భుతమైన పదార్ధాలు. ఆరోగ్య సంరక్షణలో ఈ రెండింటి ఉపయోగం చాలాకాలం నుంచి ఉన్నదే. ఆయుర్వేదంలో ఈ రెండింటికీ చాలా ప్రాధాన్యత ఉంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటే పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ రెంటి మిశ్రమం ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. 

తేనె, పసుపు రెండింట్లోనూ ఆరోగ్యానికి ప్రయోజనం కల్గించే పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే ఈ రెండింటినీ కలిపి వినియోగిస్తే రుచి పెరగడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా 5 రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చు. తేనె, పసుపు కలిపి వాడటం వల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. ఫలితంగా సీజనల్ వ్యాధులను నియంత్రించవచ్చు. చలికాలంలో ఈ రెండూ కలిపి వాడటం చాలా మంచిది. 

తేనె, పసుపు కలిపిన మిశ్రమం బరువు నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పసుపు అనేది మెటబోలిజం పెంచేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకునే కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. తేనెలో సహజసిద్ధంగా ఉండే షుగర్ ఆకలిని నియంత్రిస్తుంది. ఈ రెండింటి మిశ్రమం క్రమం తప్పకుండా వాడటం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాల కారణంగా స్వెల్లింగ్ సులభంగా తగ్గుతుంది. ఈ మిశ్రమం కీళ్ల నొప్పు, కండరాల లాగడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ప్రత్యేకించి క్రాంప్స్, ఆస్టియో పోరోసిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. 

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడతాయి. పింపుల్స్, యాక్నే, స్కిన్ స్వెల్లింగ్ వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. తేనెలో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలుంటాయి. ఇవి చర్నాన్ని హైడ్రేట్ చేస్తాయి. నిగారింపునిస్తాయి. ఈ మిశ్రమం వాడటం వల్ల చర్మ సమస్యలు దూరమౌతాయి. చర్మం నిగనిగలాడుతుంది. పుసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. అటు తేనెలో ఉండే ప్రోబయోటిక్ గుణాలు గుడ్ బ్యాక్టీరియాను పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమౌతాయి.

Also read: Fengal Cyclone: దూసుకొస్తున్న ఫెంగల్ తుపాను, ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News