Control of Diabetes, Constipation other health problems with Karela, Cucumber, Tomato Juice: మధుమేహం ఎంత ప్రమాదకరమో.. అప్రమత్తంగా ఉంటూ చిట్కాలు పాటిస్తే అంతే వేగంగా నియంత్రించుకోవచ్చు. మధుమేహం వ్యాధి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ అద్భుతమైన జ్యూస్ ఉంది. ఆ జ్యూస్ ఎలా తయారు చేయాలి, ఇతర ప్రయోజనాలేంటనేది చూద్దాం.
మధుమేహం నియంత్రణకు మూడు కూరగాయల జ్యూస్ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల అన్ని వ్యాధులు దూరమౌతాయి. టొమాటో కీరా, కాకరకాయ కూరగాయల్లో పుష్కలంగా న్యూట్రియంట్లు ఉంటాయి. ఈ మూడింటిని జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. కాకరకాయలో ప్రోటీన్లు, ఫైబర్, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూడు కూరగాయల జ్యూస్‌తో ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం..
కాకరకాయ, కీరా, టొమాటో మిశ్రమ జ్యూస్..డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ రోగులకు చాలామంచిది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు వారానికి కనీసం 4 సార్లు కాకరకాయ, కీరా, టొమాటో జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి. ఫలితంగా మధుమేహం నియంత్రణలో ఉంటాయి.
మలబద్ధకం నుంచి ఉపశమనం
కేవలం డయాబెటిస్ సమస్యకే కాకుండా..మలబద్ధకం సమస్యకు కూడా ఈ జ్యూస్ అద్భుత పరిష్కారం. కాకరకాయ, కీరాలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభం చేస్తుంది. ప్రేవుల్ని శుభ్రం చేస్తుంది. కడుపు క్లీన్ అవుతుంది.
చలికాలంలో సహజంగా ఇమ్యూనిటీ బలహీనమై..జలుబు, దగ్గు వంటి వ్యాధులు ఎదురౌతుంటాయి. ఇమ్యూనిటీని పెంచేందుకు ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం వల్ల ఏ రకమైన సీజనల్ వ్యాధులు దరిచేరవు.
Also read: Drink Water: రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలు..కిడ్నీ సమస్య, స్థూలకాయం మటుమాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook