Health benefits of Exercises: ప్రతీరోజూ విధిగా వ్యాయమం, కసరత్తులు చేయడం వల్ల బరువు తగ్గి స్లిమ్ అవడంతో పాటు పరోక్షంగా మరెన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నట్టుగా వ్యాయమంలో కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ? వాటితో కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయమం చేసేవారు ఫిట్‌గా ఉండటంతో పాటు వారు జబ్బుల నుంచి దూరమై ఆరోగ్యంగా ఉంటారు.
క్రమం తప్పకుండా చేసే వ్యాయమం ఒంట్లో బీపీని, డయాబెటిస్‌కి కారణమయ్యే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని, హార్ట్ ఎటాక్‌కి కారణమయ్యే హార్ట్ రేట్ వంటి వాటిని అదుపులో ఉంచుతుంది. అంటే మీ ఆరోగ్యం మీ అదుపులోనే ఉంటుందన్న మాట.
నిత్యం వ్యాయమం చేయడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడిని జయించి రోజు మొత్తం ఉల్లాసంగా గడిపేయొచ్చు. అంటే మానసిక ఉల్లాసానికి ఎక్సర్‌సైజెస్ ఎంతో ఉపయోగపడతాయన్న మాట.
రోజూ వ్యాయమం చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా తయారై హాయిగా నిద్ర పోయేందుకు ఉపయోగపడుతుంది. అంటే పరోక్షంగా నిద్రలేమి సమస్యను దూరం చేస్తుందని చెప్పుకోవచ్చు.
వ్యాయమం చేసే వారు తమ మనసును అదుపులో ఉంచుకుని చేసే పనులపై ఏకాగ్రత, పట్టును సాధిస్తారు. నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ఏకాగ్రత ఎంతో ఉపయోగపడుతుంది.
చాలామందిలో ఏదో సాధించాలనే పట్టుదల ఉన్నప్పటికీ.. వారిలో ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది వారిని వెనక్కి లాగుతుంటుంది. కానీ నిత్యం వ్యాయమం, ధ్యానం, యోగా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని అనుకున్న లక్ష్యాలను అలవోకగా చేరుకోవచ్చు.
నిత్యం వ్యాయమం చేసే వారిలో వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరవు. అందుకు కారణం వారి శరీరంలో ఉండే కణాలు ఎప్పటికప్పుడు వ్యర్థాలను చమట రూపంలో బయటికి పంపించి చర్మ సౌందర్యం పెంపొందించడమే.
నిత్యం వ్యాయమం చేయడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి ఎలాంటి వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్స్‌ని అయినా తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది.
ప్రతీ రోజూ ఉదయాన్నే నిద్రలేచి వ్యాయమం చేసే వారిలో మంచి క్రమశిక్షణ అలవడుతుంది. రోజూ వ్యాయమం చేయాలన్న పట్టుదలే వారిని ఒక క్రమశిక్షణలో పెడుతుంది. ఇవన్నీ ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల పరోక్షంగా కలిగే లాభాలు ( Health Tips ) .
Also Read : Foods and Headache: భరించలేని తలనొప్పి వేధిస్తుందా ? ఇవి తింటున్నారా ?
Also Read : Cardamon Benefits: రోజూ తీసుకుంటే..అధిక రక్తపోటు, కేన్సర్, బ్లడ్ షుగర్ సమస్యలకు చెక్
Also Read : Cholesterol: కొలెస్ట్రాల్ ఎంతవరకూ ప్రమాదకరం, ఏయే వ్యాధుల ముప్పు ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook