Diabetes Management Tips in Telugu: మధుమేహం అనేది ఇన్సులిన్ కొరత లేదా ఇన్సులిన్ ప్రభావం శరీరంపై మందగించడం వల్ల సంభవిస్తుంటుంది. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించలేకపోతే గుండె వ్యాధులు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలకు సైతం దారి తీస్తుంది. అందుకే డయాబెటిస్‌ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మధుమేహం అనేది ఓరకంగా లైఫ్‌స్టైల్ వ్యాధి. అందుకే లైఫ్‌స్టైల్ మార్చుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేయడం ద్వారా డయాబెటిస్ సమస్యను మందుల అవసరం లేకుండానే నియంత్రించవచ్చు. దీనికోసం కొన్ని హోమ్ రెమిడీస్ ఉన్నాయి. ఇవి తూచా తప్పకుండా పాటిస్తే కచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచవచ్చు. ఈ ఆచరణ పూర్తిగా మనం తీసుకునే ఆహార పదార్ధాలపై ఆధారపడి ఉంటుంది. ఆచరించడం కష్టమే అయినా ఆచరిస్తే మంచి ఫలితాలు కన్పించవచ్చు. అన్నింటికంటే మొదటిది గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం. సాధారణ మిల్క్ టీ పూర్తిగా మానేయాలి. ఆ స్థానంలో హెర్బల్ లేదా గ్రీన్ టీ తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలో స్వెల్లింగ్ సమస్య తగ్గుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుుతంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు, పప్పులు మీ డైట్ లో తప్పకుండా ఉండాలి. ఇందులో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను క్రమక్రమంగా తగ్గిస్తుంది. షుగర్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. స్వీట్స్, కూల్ డ్రింక్స్, కేక్, పేస్ట్రీ వంటి పదార్ధాలు తినకూడదు. వీటి స్థానంలో పండ్లు, నట్స్ చేర్చితే మంచిది
లో గ్లైసెమిక్ ఇండెక్స్ డైట్ మాత్రమే తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్ధాలు ముఖ్యంగా నట్స్, ఓట్స్, తృణధాన్యాలు, ఆకు కూరలు తీసుకోవాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. ఇక మరో చిట్కా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. ప్రోటీన్ ఫుడ్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు దోహదం చేస్తుంది. గుడ్లు, చేపలు, చికెన్, సోయా బీన్స్, పప్పులు మంచి ఆహార పదార్ధాలు.
Also read: 7th Pay Commission Latest News: గుడ్‌న్యూస్, సెప్టెంబర్‌లో 3 శాతం డీఏ పెంపు, భారీగా పెరగనున్న జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.