Hyundai Sales: దేశంలో మారుతి సుజుకి తరువాత అత్యధిక ఆదరణ పొందిన కంపెనీల్లో హ్యుండయ్ మోటార్స్ ఒకటని చెప్పవచ్చు లేదా అత్యధిక ఆదరణ పొందిన విదేశీ కంపెనీ ఇదేనని అనవచ్చు. హ్యుండయ్ మోటార్స్ కార్లకు దేశంలో క్రేజ్ ఎక్కువ. సెడాన్ కారైనా ఎస్‌యూవీ అయినా అదే పరిస్థితి.
హ్యుండయ్ కంపెనీకు చెందిన క్రెటా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ఎస్‌యూవీ పేరు చెబితే క్రెటానే గుర్తొస్తుంది. ఎస్‌యూవీ విభాగంలో దేశంలో క్రెటా, టాటా నెక్సాన్ పోటీ పడుతుంటాయి. ఇప్పుడు ఇదే ఎస్‌యూవీ విభాగంలో హ్యుండయ్ కంపెనీ మరో కారుని నిలబెడుతోంది. ఇటీవల ఆ కారుకు క్రేజ్ పెరుగుతోంది. హ్యుడయ్ మోటార్స్ కంపెనీ జూన్ 2023లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసింది. జూన్ నెలలో 50 వేల యూనిట్ల విక్రయాలు జరిపింది. ఇదే గత ఏడాది జూన్ నెలలో 49 వేల యూనిట్ల అమ్మకాలయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 2.04 శాతం వృద్ధి సాధించింది. ఇందులో అత్యధికంగా విక్రయాలు జరిపింది హ్యుండయ్ క్రెటా. ఇదొక సౌకర్యవంతమైన ఎస్‌యూవీ. అమ్మకాల్లో హ్యుండయ్ క్రెటా..టాటా నెక్సాన్, మారుతి బ్రిజాలను వెనక్కి నెట్టేసింది.
జూన్ నెలలో క్రెటా 14,447 యూనిట్లు అమ్మకాలు నమోదు చేసింది. ఏడాది క్రితం 13,790 యూనిట్ల విక్రయాలయ్యాయి. క్రెటా విక్రయాల్లో ప్రతి యేటా 5 శాతం వృద్ది నమోదు చేస్తోంది. హ్యుండయ్ కంపెనీకు చెందిన మరో ఎస్‌యూవీ హ్యుండయ్ వెన్యూ కూడా అదే స్థాయిలో విక్రయాలు జరుపుతోంది. జూన్ నెలలో 11, 606 యూనిట్లు అమ్ముడుపోయింది. విక్రయాల్లో 12 శాతం పెరుగుదల నమోదు చేసింది. హ్యుండయ్ వెన్యూ ధర ఢిల్లీలో 7.72 లక్షల్నించి ప్రారంభమై 13.18 లక్షల వరకూ ఉంది. హ్యుండయ్ వెన్యూ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ 83 పీఎస్, 114 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక 1 లీటర్ టర్బో పెట్రోల్ 120 పీఎస్, 172 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే 116 పీఎస్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.
ఇక హ్యుండయ్ వెన్యూ ఫీచర్ల గురించి పరిశీలిస్తే..కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 8 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూల్డ్ గ్లోబాక్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ , ఆటోమేటిక్ డ్రైవర్ సీట్, సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉంటాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్, ఈబీడీ విత్ ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్, రేర్ వ్యూ కెమేరా, రేర్ పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.
Also read: Petrol Pump Business: పెట్రోల్ బంక్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారా..? ఎంత ఖర్చవుతుందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Hyundai Sales: హ్యుండయ్ క్రెటాతో సమానంగా క్రేజ్ పొందుతున్న మరో ఎస్‌యూవీ, ధర ఎంతంటే