Ayurvedic Remedies For Dust Allergy: వాతావరణ మార్పు, సీజన్‌లో మార్పుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది జలుబు, తుమ్ములతో బాధపడుతుంటారు. దీనికి మెయిన్ కారణం వాతావరణం మార్పు వల్ల వచ్చే డస్ట్ ఎలర్జీ. ఇక చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే సరి. మీ ఇంట్లో రెమెడిస్ పాటించి మీ డస్ట్ ఎలర్జీకి చెక్ పెట్టోచ్చు. మరి అవేంటో ఇక్కడ చూద్దాం.
పసుపు పాలు
పసుపు యాంటిబయోటిక్ అనే విషయం అందరికి తెలిసిందే. పాలలో చిటెకెడు పసుపు వేసుకుని తాగితే.. సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చు. లేదా ముందు నుంచి వాడటం వల్ల సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండోచ్చు. ఎంతో మంచి దాని ఔషధ గుణాలు ఉన్న ఈ పసుపు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దివ్వ జౌషధంగా పని చేస్తోంది. మీరు తరచుగా డస్ట్ అలర్జీతో బాధపడుతుంటే పసుపు పాలు తాగండి. ఒక కప్పు పాలలో అర టీస్పూన్ పసుపు వేసి.. వేడి చేసి ఆపై తేనె కలుపుకుని నిద్రపోయే ముందు తాగాలి. ఇది మీ అలెర్జీని తొలగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
పుదీనా టీ
డస్ట్ అలర్జీని అరికట్టడం మరో బెస్ట్ రెమెడీ పుదీనా టీ. జలుబు, దగ్గు వంటి సమస్య ఉన్నప్పుడు పుదీన టీ ఇన్‌స్టాంట్‌గా ఉపశమనం ఇస్తుంది. అలాగే తరచూ తీసుకోవడం వల్ల కూడా అలర్జీని దూరమవుతుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక కప్పు నీటిని తీసుకుని వాటిని మరిగించాలి. మరిగించేటప్పుడు 10 నుంచి 12 పుదీనా ఆకులు వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి ఒక టెబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. పుదీనాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, డీకాంగెస్టెంట్ లక్షణాల వల్ల తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం వంటి డస్ట్ అలర్జీ లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
తేనె
ఆయుర్వేదంలో తేనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో తేనె ఉపయోగపడుతుంది. డస్ట్ అలర్జీని దూరం చేసేందుకు తేనె తీసుకోవచ్చు. రోజూ రెండు టీస్పూన్ల తేనెను తీసుకోవడం వల్ల అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందనే విషయం అందరికీ తెలుసు. అయితే చేదుగా ఉండటం ఎక్కువ మంది గ్రీ టీని ఇష్టపడరు. కానీ రోజూ తాగడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా చాలా మంది బరువు తగ్గేందుకు గ్రీన్ టీని తాగుతారు. బరువు తగ్గడమే కాకుండా యాంటీఆక్సిడెంట్-రిచ్ గ్రీన్ టీ అలర్జీ లక్షణాలను తగ్గిస్తాయి. ముఖ్యంగా దుమ్ము, ధూళి వల్ల కలిగే అలర్జీలను నివారించడంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
ఆవు నెయ్యి
డస్ట్ అలర్జీకి ఆవు నెయ్యి కూడా చక్కటి పరిష్కారం మార్గం. ప్రతి రోజు ఉదయం మీ ముక్కులో రెండు చుక్కల స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకుంటే.. అలర్జీలు, దుమ్ము పురుగుల నుంచి రక్షణ కలుగుతుంది. నెయ్యి వల్ల ఒక రక్షిత పొర ఏర్పడి.. దగ్గు, తుమ్ము, ముక్కు కారడం వంటి కారకాలను నిరోధిస్తుంది.
Also Read: Election Survey 2023: ఆసక్తి రేపుతున్న ఆ సర్వే, తెలంగాణ, ఎంపీ, రాజస్థాన్‌లో అధికారం ఎవరిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook