Belly Fat Loss Tips: బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ 5 రకాల ఆహారం తింటే చాలు!

Belly Fat Loss Tips: మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు కొంతమందికి సరైన సమయం కూడా ఉండడం లేదు. అలాంటి వాళ్లు ఈ 5 రకాల ఆహారాన్ని ప్రతిరోజూ తింటే మీరు వెంటనే బరువు తగ్గుతారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 12:03 PM IST
Belly Fat Loss Tips: బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ 5 రకాల ఆహారం తింటే చాలు!

Belly Fat Loss Tips: ఈరోజుల్లో ప్రతిఒక్కరూ ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ సమయాభావం వల్ల వర్కవుట్‌లు చేయడానికి సమయం దొరకడం లేదని కొందరు బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్ ఉండాలంటే ఎలా అని ఆందోళన చెందుతున్న వారున్నారు. అలాంటి వారు కొన్ని ఆరోగ్యకరమైన టిప్స్ పాటించడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. అదెలాగో తెలుసుకోండి. 

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు తినాల్సిన ఆహారం..

1. బాదంపప్పు

బాదంపప్పులో పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. రోజుకు మీరు 5 నుంచి 6 బాదంపప్పులు తింటే మీ ఆకలి తీరుతుంది. దీంతో పాటు తగినంత శక్తి మీ శరీరానికి అందుతుంది. 

2. ఆపిల్

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరం ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. అయితే యాపిల్ తినడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. ఒక యాపిల్ లో 4 నుంచి 5 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మీకు తొందరగా ఆకలి వేయదు. 

3. దాల్చిన చెక్క

మీ ఆహారం లేదా టీలో చక్కెరకు బదులుగా దాల్చిన చెక్కను వేసి తీసుకోవచ్చు. అలా చేస్తే మీ శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని నియంత్రిస్తుంది. దీంతో ఊబకాయం సమస్య నుంచి మీకు విముక్తి లభిస్తుంది. 

4. గుడ్డులోని తెల్లసొన

మీరు కోడిగుడ్డులోని తెల్లసొనను మాత్రమే తింటే బరువు తగ్గే అవకాశం ఉంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల వెంటనే ఆకలిగా అనిపించదు. అందుకు కోడిగుడ్లను అల్పాహారంగా తీసుకుంటారు. 

5. క్వినోవా

మీరు రోజూ తినే ఆహారంలో బియ్యానికి బదులుగా క్వినోవా తినవచ్చు. దీని వల్ల స్టార్చ్ మీ శరీరంలోకి వెళ్లదు. దీని వల్ల మీరు ఊబకాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికల ఆధారంగా సేకరించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదిస్తే మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Watermelon Risks: ఈ అనారోగ్యాలతో బాధపడేవారు పుచ్చకాయ తినకూడదు!

Also Read: Dangerous Fruit Combinations: అరటిపండుతో పాటు ఈ ఫ్రూట్ కలిపి తింటే ఇక అంతే సంగతులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News