Amla Hair Benefits: ఉసిరి కాయల వినియోగంతో తెల్ల జుట్టు మటుమాయం!

Amla Hair Benefits: శరీరానికి ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉసిరి అంటేనే విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్. రోజుకు ఒక్క ఉసిరి కాయ తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. దీంతో పాటు జుట్టుకు ఆరోగ్యం.. సహజమైన నల్లని రంగును కలిగి ఉండేలా తోడ్పడుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 03:57 PM IST
Amla Hair Benefits: ఉసిరి కాయల వినియోగంతో తెల్ల జుట్టు మటుమాయం!

Amla Hair Benefits: ఉసిరికాయను అనేక శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం సహా విటమిన్ - సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలను ఉసిరి శరీరానికి అందిస్తుంది. శరీరంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు ఉసిరి సహకరిస్తుంది. తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించుకునేందుకు ఉసిరి సహకరిస్తుంది. దీంతో పాటు ఉసిరి కాయల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉసిరి కాయల వల్ల కలిగే ప్రయోజనాలు

1) ప్రస్తుతం కాలుష్యం, ఒత్తిడి కారణంగా చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. అయితే అందుకోసం కొందరు డై లేదా హెయిర్ కలర్ వేస్తున్న నేపథ్యంలో.. మరికొందరు మాత్రం అలాంటి పనులు చేసేందుకు సహసించడం లేదు. అలాంటి వారు ఉసిరి కాయల రసాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉసిరి కాయల రసాన్ని జుట్టుకు అప్లే చేసి.. కొద్దిసేపటి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. అలా మూడు నెలలు చేయడం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. 

2) ఆధునిక కాలంలో చాలా మందికి జుట్టుకు నూనె రాసే అలవాటు పోయింది. కానీ, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలకు నూనె తప్పకుండా అవసరం. నూనెతో పాటు ఉసిరి కాయల రసంతో హెయిర్ మసాజ్ చేయవచ్చు. ఆ తర్వాత దాన్ని కడిగేయాలి. 

3) మీరు జుట్టుకు హెన్నా వంటి వాటిని ఉపయోగిస్తే.. దాని కోసం మీరు ఉసిరి కాయల రసాన్ని వినియోగించవచ్చు. ఉసిరి కాయల రసంలో రాత్రంతా హెన్నా నానబెట్టి.. ఉదయాన్నే జుట్టుకు అప్లే చేయడం వల్ల సహజమైన నల్లని రంగు జుట్టుకు అందుతుంది.   

Also Read: Garlic Tea Benefits: టీలో మరో కొత్త రకం.. వెల్లుల్లి టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Also Read: Aloe Vera Side Effects: కలబంద రసాన్ని ఎక్కువగా వాడితే కలిగే అనర్థాలు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News