Reason Behind Buttabomma Postponing: మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను ఈ మధ్య తెలుగులో రీమేక్ చేస్తున్న కల్చర్ బాగా పెరిగింది. ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ భీమ్లా నాయక్ సినిమాని తీసుకొచ్చిన తర్వాత మరో సినిమాని కూడా తెలుగులోకి తీసుకువస్తోంది. మలయాళంలో కప్పేలా అనే ఒక సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది, చాలా చిన్న పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దాని రీమేక్ హక్కులు కూడా కొనుగోలు చేశారు నాగ వంశీ.
అయితే ఈ సినిమా జనవరి 26వ తేదీన విడుదల కావాల్సి ఉంది కానీ అనూహ్యంగా ఫిబ్రవరి 4వ తేదీ విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేశా.రు అయితే దాని వెనుక నాగవంశీ సహా చినబాబు నివాసాల మీద ఐటీ రైడ్స్ జరగడమే కారణమని అందరూ అనుకుంటే అది కాదని అసలు విషయం వేరే ఉందని నాగ వంశీ చెప్పుకొచ్చారు. బుట్ట బొమ్మ రిలీజ్ డేట్ ని 26వ తేదీ నుంచి నాలుగో తేదీ ఫిబ్రవరికి మార్చడానికి కారణం ఫిబ్రవరి సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు.
తమ బ్యానర్ నుంచి వచ్చిన భీష్మ, భీమ్లా నాయక్, డీజే టిల్లు వంటి సినిమాలు ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయి సూపర్ హిట్ లుగా నిలిచాయని, ఆ సెంటిమెంట్ వల్లనే ఈ సినిమా వాయిదా వేసుకున్నామని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ ఫిబ్రవరిలో తమ బ్యానర్ నుంచి బుట్ట బొమ్మ, షహజాదా, వాతి అనే సినిమాలు వస్తున్నాయని ఈ మూడు సినిమాలు సూపర్ హిట్లర్ అవుతాయని నమ్మకం తమకుందని చెప్పుకొచ్చారు.
జనవరిలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి రెండు మాస్ బ్లాక్ బస్టర్ సినిమాలను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారని ఇప్పుడు ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ చూడాల్సిందేనని ఆయన అన్నారు. అంతేకాక ఒరిజినల్ బుట్ట బొమ్మ నుంచి ఒక్క ప్లాట్ మాత్రమే తీసుకున్నామని, మన తెలుగు కల్చర్ కి తగినట్లుగా అనేక మార్పులు చేర్పులు చేశామని ఈ సందర్భంగా నాగ వంశీ చెప్పుకొచ్చారు
Also Read: Pawan Kalyan’s OG: కొత్తగా పవన్ కళ్యాణ్-సుజీత్ ల 'ఓజీ..అవేమీ ఉండవట?
Also Read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారకరత్న పరిస్థితి.. బాబు ఏమన్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook