Adipurush villain: ఆదిపురుష్ మేకర్స్‌కి ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్

ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ శ్రీరాముడు అంటే ఫుల్ ఖుషీ అయిన డార్లింగ్ ఫ్యాన్స్.. అతడికి విలన్‌గా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్‌ని ( Saif Ali Khan as villain ) మాత్రం ఊహించుకోలేకపోతున్నారు. ప్రభాస్‌కి విలన్‌గా సైఫ్ అలీ ఖాన్‌ని కాకుండా ఇంకెవరినైనా తీసుకోవాల్సిందిగా ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రావత్‌కి ( Om Raut ), ఆ చిత్ర నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Sep 13, 2020, 01:10 AM IST
Adipurush villain: ఆదిపురుష్ మేకర్స్‌కి ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్

ఆదిపురుష్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడు అంటే ఫుల్ ఖుషీ అయిన డార్లింగ్ ఫ్యాన్స్.. అతడికి విలన్‌గా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్‌ని ( Saif Ali Khan as villain ) మాత్రం ఊహించుకోలేకపోతున్నారు. ప్రభాస్‌కి విలన్‌గా సైఫ్ అలీ ఖాన్‌ని కాకుండా ఇంకెవరినైనా తీసుకోవాల్సిందిగా ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రావత్‌కి ( Om Raut ), ఆ చిత్ర నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ఆదిపురుష్ విలన్ పాత్రల కోసం కొన్ని పేర్లు కూడా సూచిస్తున్నారు. అలా ప్రభాస్ ఫ్యాన్స్ సూచిస్తున్న పేర్లలో రానా దగ్గుబాటి, సోను సూద్ ( Rana Daggubati, Sonu Sood ) లాంటి స్టార్లు కూడా ఉన్నారు. Also read : Bigg boss 4 Telugu first weekend: బిగ్ బాస్ 4 తెలుగు.. అభిజిత్‌ని అవమానించిన అరియానా

బాహుబలి చిత్రంలో ( Baahubali ) ప్రభాస్, రానా దగ్గుబాటి మధ్య హీరో-విలనిజం ఎంత బాగా సూట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందుకే రానా దగ్గుబాటి అయితే రావణుడి విలనిజానికి, పర్సనాలిటీకి మ్యాచ్ అవుతాడని విశ్లేషణలు ఇస్తున్నారు. Also read : Kangana Ranaut's Y-plus security: కంగనాకు అందుకే వై-ప్లస్ సెక్యురిటీ: కేంద్ర మంత్రి

బాలీవుడ్‌లో సత్తా కలిగిన నటులలో సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఓం రావత్‌ బహుశా సైఫ్ వైపు మొగ్గి ఉండవచ్చు. అంతేకాకుండా ఓం రావత్ డైరెక్ట్ చేసిన తన్హాజి ( Tanhaji ) చిత్రంలో అజయ్ దేవ్‌గన్‌కి విలన్‌గా పోటీ ఇవ్వడంలో సైఫ్ అలీ ఖాన్ తనదైన మార్క్ చూపించుకున్నాడు అని కొందరు చెబుతుంటే.. ఎవరెన్ని చెప్పినా మా డార్లింగ్‌తో విలన్‌గా నటించాలంటే సైఫ్ సరిపోడంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి ఈ వ్యతిరేకతను ఆదిపురుష్ మేకర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచిచూడాల్సిందే మరి. Also read : Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌ కంటెస్టంట్స్‌లో కట్టప్ప ఎవరో చెప్పిన నాగ్

Trending News