ఆర్ఆర్ఆర్ నుంచి తారక్ హీరోయిన్ ఔట్; ఆ ఛాన్స్ ఎవరిది ?

ఆర్ఆర్ఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఔట్ 

Last Updated : Apr 6, 2019, 03:39 PM IST
ఆర్ఆర్ఆర్ నుంచి తారక్ హీరోయిన్ ఔట్; ఆ ఛాన్స్ ఎవరిది ?

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకదిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి మరోసారి అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో చెర్రీ సరసన ఆలియా భట్, యంగ్ టైగర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్జర్ జోన్స్ హీరోయిన్స్‌గా నటించనున్నారని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఉన్నట్టుండి ఈ సినిమాలో తారక్ సరసన చేయాల్సి ఉన్న డైసి ఎడ్గర్ జోన్స్ ఈ సినిమాలో నటించడం లేదని తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రకటించింది.

కొన్ని అనివార్య కారణాల వల్ల డైసి ఎడ్గర్ జోన్స్ ఈ సినిమా చేయడం లేదని తెలిపిన యూనిట్.. ఆమె భవిష్యత్‌లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్టు ఆకాంక్షను వ్యక్తపరిచింది. దీంతో తారక్ సరసన హీరోయిన్ పోస్ట్ ఖాళీ అయింది. ఇక మళ్లీ డైసి స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కేనో అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

Trending News