బాహుబలికి "బ్లాక్ పాంథర్" నటుడు ఫిదా..!

భారతీయ చిత్ర పరిశ్రమలోనే కాకుండానే కూడా అంతర్జాతీయంగా కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న చిత్రాలు  ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. 

Last Updated : Apr 16, 2018, 11:47 PM IST
బాహుబలికి "బ్లాక్ పాంథర్" నటుడు ఫిదా..!

భారతీయ చిత్ర పరిశ్రమలో మాత్రమే కూడా అంతర్జాతీయంగా కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న చిత్రాలు  ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. ఇటీవలి కాలంలో ఈ చిత్రాలకు హాలీవుడ్ సినిమా "బ్లాక్ పాంథర్" నటుడు విన్‌స్టన్‌ డ్యూక్‌ కూడా ఫిదా అయిపోయారు. ‘బాహుబలి’లో ఓ స్టిల్‌ను పోస్ట్‌ చేసి.. ‘బాహుబలి’; ‘బాహుబలి 2’ సినిమాలంటే చాలా ఇష్టం’ అని తన ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్‌లో తెలిపారు.

అయితే డ్యూక్ పోస్టింగ్ పై బాహుబలి టీమ్ స్పందించింది. ‘విన్‌స్టన్‌ డ్యూక్‌‌కి ‘బాహుబలి’ చిత్రాలు నచ్చడం విశేషం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై మీకున్న ప్రేమకు థ్యాంక్స్. మీకు మా చిత్రాలు నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ‘బ్లాక్‌ పాంథర్‌’లో మీరు చేసిన‘ఎం.బాకు’ పాత్ర మాకు చాలా నచ్చింది. ‘అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌’ కోసం మేం ఎదురుచూస్తున్నాం’ అని బాహుబలి టీమ్ ట్వీట్‌ చేసింది.

ఆ ట్వీట్‌కి విన్‌స్టన్‌ డ్యూక్‌ సమాధానం ఇచ్చారు. ‘మీ సినిమాలు చాలా బాగుంటాయి. మాస్టర్‌ పీస్‌లు (‘బాహుబలి’, ‘బాహుబలి 2’) అందించినందుకు థ్యాంక్స్’ అని ట్వీట్‌ చేశారు. ఇటీవలే విన్‌స్టన్‌ డ్యూక్‌  నటించిన ‘బ్లాక్‌ పాంథర్‌’ విడుదలై హాలీవుడ్‌లో పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఈ చిత్రాన్ని రూ.1300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. డ్యూక్ నటిస్తున్న మరో చిత్రం ‘అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌’ పై ఆయన అభిమానులకు ఎన్నో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్‌ 27న విడుదలవుతోంది.

Trending News