Atharva: ‘అథర్వ’ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయం: డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా

Atharva Movie 2023: పోలీసు వ్యవస్థలోని క్లోజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని  ‘అథర్వ’  సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సస్పెన్స్ తో పాటు ఎంతో థ్రిల్లింగ్ గా ఉండబోతున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2023, 09:17 PM IST
Atharva: ‘అథర్వ’ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయం: డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా

Atharva Movie 2023: అన్ని సినిమాలకు భిన్నంగా సస్పెన్స్, క్రైమ్ తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ తో రూపొందిస్తున్న చిత్రం ‘అథర్వ’. ఈ సినిమాను పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నరసింహం, అనసూయమ్మ రూపొందిస్తున్నారు. ఈ మూవీలో కార్తీక్ హీరోగా రాజు, హీరోయిన్స్ గా సిమ్రాన్ చౌదరి, ఐరా నటిస్తున్నారు. ఈ మిక్స్డ్ ఎంటర్టైన్మెంట్ మూవీనికి మహేష్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు నూతలపాటి సుభాష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.  విజయ, ఝాన్సీ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సినీ బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన గెస్టులుగా దర్శకుడు శశి కిరణ్ తిక్క, హీరో చైతన్య రావులు పాల్గొన్నారు. అనంతరం ట్రైలర్ను విడుదల చేసి సినిమా గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. 

శశి కిరణ్ తిక్క సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘అథర్వ సినిమాలో జావేద్ ఆలీ పాడిన పాట నాకు ఎంతో ఇష్టం నేనెప్పుడూ ఆ పాటను పదేపదే వింటూ ఉంటాను. నాకు ఆ పాట అంటే ఎంత ఇష్టమో మాటల్లో వివరించడం కష్టం. ఆ పాట తప్ప నాకు ఇప్పటికీ ఏమీ తెలియదు.. నేను ఇంతకుముందే సినిమా ట్రైలర్ ని చూశాను. ప్రతి విషయాన్ని క్లుప్తంగా చూపించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత ఉంటారనే విషయాన్ని కూడా తెలుసుకోగలిగాను.. ఇంత డీటెయిల్ గా అన్నీ చూస్తారా..? క్లూస్ టీం గురించి బాగా వివరించారు. ఈ సినిమా ట్రైలర్ ని చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.. యాక్టర్ మా మహేష్, నిర్మాత సుభాష్ కి ఆల్ ది బెస్ట్ డిసెంబర్ ఒకటో తేదీన మూవీ రాబోతోంది. బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

 ఈ సినిమాపై దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. "పోలీస్ డిపార్ట్మెంట్లో క్లూస్ టీం ఎలా ఉంటుందో డీటెయిల్ గా చూపించబోతున్నాం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ తో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ విడుదల చేసిన ట్రైలర్లు చూపించిన సస్పెన్స్లకంటే సినిమాలో బోలెడు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని చేశారు. ఇక సౌండ్ విషయానికొస్తే చరణ్ పాకాల తనదైన స్టైల్ లో చిత్రానికి గొప్ప సంగీతం అందించాడు. కెమెరామెన్ చరణ్ నాకు ఇంతకు ముందే పరిచయం. కాబట్టి మంచి విజువల్స్ అందించగలిగాడు. 

కార్తీక్ రాజు ఎంతో చిల్ ఉంటాడు. కాబట్టి తెరపై కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తారు. ఈ సినిమాలో సిమ్రాన్ పాత్ర ఎంతో బాగుంటుంది.. ఇక ఐరా విషయానికొస్తే అద్భుతంగా నటించింది. ఈ కథను నమ్మి సుభాష్, శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరించినందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా ట్రైలర్ విడుదల చేసినందుకు శశికిరణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు.. చైతన్య రావు నాకు క్లోజ్ ఫ్రెండ్. అతనికి నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమా ద్వారా మిమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

సినిమా నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. "ఈ సినిమా టీమ్ అంతా రాత్రి పగలు కష్టపడుతూ తీశాం.. ముఖ్యంగా మీడియా సపోర్ట్ ద్వారా జనాల్లోకి ఇంకా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను." అని అన్నారు.

 చైతన్య రావు సినిమా గురించి వివరిస్తూ.. డిసెంబర్ ఒకటో తేదీన అథర్వ విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ఇంతకుముందే చూశాను. ఇది పక్కా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సౌండ్ అదిరిపోయింది. శ్రీ చరణ్ తనదైన మార్క్ వేశారు.  ఇంతవరకు పోలీస్ క్లూస్ టీం కి సంబంధించిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఈ సినిమా ద్వారా మహేష్ రెడ్డి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. ఈ సినిమాల్లో కార్తీక్, సిమ్రాన్, ఐరాలు అద్భుతంగా నటించారు. నాతో మహేష్ పక్కా కమర్షియల్ డైరెక్టర్ అవుతారు. డిసెంబర్ 1వ తేదీన తప్పకుండా అందరూ థియేటర్లో చూడండి" అని అన్నారు.

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

సినిమా గురించి కార్తీక్ రాజు మాట్లాడుతూ.. "ఈ సినిమాకు సంబంధించిన పూర్తి క్రెడిట్ డైరెక్టర్ మహేష్ రెడ్డికే దక్కుతుంది. ఈ మూవీ కంటెంట్ తో పాటు కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇంతవరకు క్లూస్ టీం కి సంబంధించిన తెలియని విషయాలు తెలుసుకోబోతున్నారు. శ్రీ చరణ్ పాకాల తో పనిచేయడం నాకు ఇది రెండవసారి. ఈ సినిమాలో కెమెరామెన్ చరణ్ మా అందరిని అందంగా చూపించారు. ఇలాంటి మంచి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సుభాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు" అని అన్నారు.

సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. నేను ఇప్పటివరకు థ్రిల్లర్ సినిమాలను చాలానే చేశాను. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా డిపార్ట్మెంట్లో ఉంటాయి. కానీ క్లూస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎవరికి తెలియదు. ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను మహేష్ రెడ్డి రూపొందించాడు. కొత్త సౌండ్ ను అందించడానికి నాకు మంచి స్కోప్ అందించాడు. ఈ సినిమాకు అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. కాబట్టి మీరందరూ డిసెంబరు 1వ తేదీన థియేటర్లో చూడండి." అని అన్నారు.

కెమెరామెన్ చరణ్ ఈ సినిమాపై మాట్లాడుతూ.."మా సినిమా ట్రైలర్ను విడుదల చేసిన శశికిరణ్, హీరో చైతన్య రావుకి ప్రత్యేక ధన్యవాదాలు.. క్లోజ్ డిపార్ట్మెంట్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News