గోధుమ పిండి సంచుల్లో నోట్ల కట్టల పంపిణీపై స్పందించిన అమీర్ ఖాన్‌

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పనిని కోల్పోయిన నిరుపేదలు, వలస కూలీలకు సినిమా ప్రముఖులు నిత్యావసర సరకులు పంపిణీ చేసి వారి గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. అలా నిత్యావసరాలు పంపిణీ చేసే క్రమంలో ఢిల్లీలోని కొన్ని మురికివాడల్లో పంచిపెట్టిన గోధుమ పిండి సంచుల్లో రూ.15 వేల విలువైన నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Last Updated : May 5, 2020, 02:02 AM IST
గోధుమ పిండి సంచుల్లో నోట్ల కట్టల పంపిణీపై స్పందించిన అమీర్ ఖాన్‌

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పనిని కోల్పోయిన నిరుపేదలు, వలస కూలీలకు సినిమా ప్రముఖులు నిత్యావసర సరకులు పంపిణీ చేసి వారి గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. అలా నిత్యావసరాలు పంపిణీ చేసే క్రమంలో ఢిల్లీలోని కొన్ని మురికివాడల్లో పంచిపెట్టిన గోధుమ పిండి సంచుల్లో రూ.15 వేల విలువైన నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నోట్ల కట్టలు అమీర్ ఖాన్ పంచిపెట్టినవే అయ్యుంటానేది సోషల్ మీడియాలో జరిగిన ఆ ప్రచారం సారాంశం. 

Also read : మే 7 నుంచి.. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే

అమీర్ ఖాన్  గోధుమ పిండి సంచుల్లో నోట్ల కట్టలు పంపిణీ చేశాడని వార్త వైరల్‌గా మారిన నేపథ్యంలో స్వయంగా ఆ బాలీవుడ్ నటుడే ట్విటర్ ద్వారా స్పందించాడు. గోధుమ పిండి సంచుల్లో నోట్ల కట్టలు పంచిపెట్టింది తానేనని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అమీర్ ఖాన్ స్పష్టంచేశాడు. అంతేకాకుండా ఆ నోట్ల కట్టలు పెట్టడం అనేది బహుశా ఓ ఫేక్ న్యూస్ అయినా అయ్యుంటుంది లేదంటే అవి పంచిపెట్టిన రాబిన్ హుడ్‌కి తన వివరాలను బహిర్గతం చేసుకోవడం ఇష్టం అయినా లేకపోయుండొచ్చు అని అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.

Also read : టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు

గోధుమ పిండి సంచుల్లో అమీర్ ఖాన్ నోట్ల కట్టలు పంచిపెట్టాడట అనే వార్త తొలుత ఓ టిక్ టాక్ వీడియో నుంచి వైరల్ అయ్యింది. అప్పుడు ఆ వీడియో ఎంత వైరల్‌గా మారిందో.. తాజాగా ఆ నోట్ల కట్టలు పంపిణీ చేసింది అమీర్ ఖాన్ కాదట అనే వీడియో కూడా అంతే వైరల్‌గా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News