Pavala Syamala: తెలుగులో ఎన్నో చిత్రాల్లో లేడీ కమెడియన్ గా యాక్ట్ చేసి ప్రస్తుతం ఆరోగ్యం సహకరించక సినిమాలకు దూరమైన పావల శ్యామలకు ఇప్పటికే పలువురు హీరోలు తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మా అసోషియేషన్ సహా వడ్డీతో వస్తోన్న డబ్బులనని ఆమె హాస్పిటల్ ఖర్చులకే సరిపోతున్నాయి. దీంతో ఆర్ధిక సాయం కోసం ఎదురు చూస్తోంది.
ప్రస్తుతం పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా సీనియర్ నటి పావలా శ్యామలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్. ఘట్ కేసర్ లోని ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ సొసైటీలో ఆశ్రయం పొందుతోంది పావలా శ్యామల.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఆమె పరిస్థితి తెలుసుకున్న ఆకాష్ జగన్నాథ్..అక్కడికి వెళ్లి ఆర్థికంగా తన వంతు సాయం అందించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తనకు సాయం చేసిన ఆకాష్ కు పావలా శ్యామల కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా అతను చేసిన సాయం చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తంగా యంగ్ హీరోల్లో ఆకాష్ జగన్నాథ్ ఆర్ధికంగా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్న పావలా శ్యామలకు సాయం చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఆకాష్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.