Vijay Devarakonda - The Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Vijay devarakonda as The Family Star Second single Lyrical Video: విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌,టీజర్, ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేసారు. ఈ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2024, 08:56 PM IST
Vijay Devarakonda - The Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ నుంచి సెకండ్ సింగిల్  విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Vijay devarakonda as The Family Star Second single Lyrical Video: టాలీవుడ్‌ సహా వివిధ సినీ ఇండస్ట్రీస్‌లో హిట్ కాంబినేషన్స్‌ ను రిపీట్ చేస్తున్నారు. ఈ కోవలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాం కాంబో అని చెప్పాలి. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'గీత గోవిందం' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. ఇపుడీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ది ఫ్యామిలీ స్టార్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ సహా ఇతర ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను లిరికల్ వీడియోను విడుదల చేసారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాగూర్ కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటి కపుడు ఇస్తూ ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఇదే ఆయన్ని అభిమానుకులకు దగ్గరయ్యేలా చేసింది.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదిన ఈ సినిమా ను తెలుగు, తమిళం, హిందీలో గ్రాండ్‌గా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'కళ్యాణి వచ్చా వచ్చా'  సాంగ్‌ను రిలీజ్ చేశారు.  ఈ పాటలో వీళ్లిద్దరు పెళ్లి వేడుకలకు సంబంధించిన వచ్చే  ఈ పాట విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా.. సింగారీ చెయ్యందించా.. ఏనుగంబారీ సిద్దంగుంచా అంటూ సాగే ఈ పాట పల్లవి ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ఈయనకు ప్రముఖ  సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయ్యారు. తెలుగులో అల్లు అర్జున్ తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ సత్తా చాటారు. రౌడీ హీరో ఇన్‌స్టాను ఈ రేంజ్ ఫాలోవర్స్ అనుసరించడం స్టార్ గా ఆయన క్రేజ్ ను ఎలాంటిదో చూపిస్తోంది. అంతేకాదు తనకు సినిమాలకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వచ్చే రూమర్స్ పై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉంటారు. వాటిని అప్పటికపుడు క్లారిటీ ఇస్తూ ఉంటారు. 

విజయ్ దేవరకొండలోని ఈ నైజమే ఈయన్ని అభిమానులకు దగ్గర చేసింది.  లాస్ట్ ఇయర్  'ఖుషీ' మూవీతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీలో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అయినా.. ఈ కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ ఏమి చూపించలేదు. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో విజయ్ దేవరకొండ మరో హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. 

Also Read: Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News