Family Star: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమాకు తొలి రోజు నుంచే కొంది మంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడంతో అది సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. అనుకున్న దాని కన్న తక్కువే వచ్చాయి. మొదటి రోజు ఓ మోస్తరు వసూళ్లన రాబట్టిన ఈ సినిమా రెండో రోజ శనివారం, ఆదివారాలు పూర్తిగా డల్ అయ్యాయి. సోమవారం అనుకున్నంత రేంజ్‌లో ఆక్యుపెన్షీ రాబట్టలేకపోయింది. కానీ ఉగాది పండగ రోజున ఈ సినిమా చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు ఎగబడ్డారు. తొలి రోజు చాలా చోట్ల హౌస్‌ఫుల్ పడని ఈ సినిమాకు చాలా మల్టీప్లెక్స్, సింగిల్ థియటేర్స్ అన్ని ఫుల్ కనిపించి కిటకిటలాడాయి. ఈ రోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ పర్వాలేదనపించే స్థాయిలో ఉన్నాయి. రేపు రంజాన్ హాలీడేతో పాటు సెకండ్ శనివారం, ఆదివారం సెలవులు ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశాలున్నాయి.
పైగా సినిమాకు పోటీగా 'టిల్లు స్క్వేర్', మంజుమ్మేల్ బాయ్స్' మూవీస్ ఉన్నా.. ఇవీ ఫ్యామిలీ సినిమాలు కావు. కాబట్టి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీకి ఇది అడ్వాంటేజ్‌గా మారిందని చెప్పాలి. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో మాత్రమే రిలీజ్ చేశారు. హిందీలో మాత్రం విడుదల చేయలేదు. మొత్తంగా నెగిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు ఇపుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. పైగా పెద్ద సినిమాలేని లేకపోవడం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ భారీ ఎత్తున నిర్మించారు. గీత గోవిందం' సినిమాకు సంగీత బాణీలు అందించిన గోపీ సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. మొత్తంగా ఈ వారం వీకెండ్‌ను ఫ్యామిలీ స్టార్ మూవీ ఏ విధంగా క్యాష్ చేసుకుంటుందో చూడాలి.
విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ 'ఖుషీ' మూవీతో ఆడియన్స్‌ను పలకరించారు. అంతకు ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' మూవీలో ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ముందుకు వచ్చారు. త్వరలో గౌతమ్ తిన్ననూరి సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో తొలిసారి కాప్ పాత్రలో కనిపించబోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook