Identity Trailer Talk: ఆకట్టుకుంటున్న త్రిష, టోవినో థామస్ ల ‘ఐడెంటిటీ’ ట్రైలర్.. ఈ నెల 24న రిలీజ్..

Identity Trailer Talk:  త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్, మందిర బేడిలు ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేసిన చిత్రం‘ఐడెంటిటీ’. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను  విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 20, 2025, 07:34 PM IST
Identity Trailer Talk: ఆకట్టుకుంటున్న త్రిష, టోవినో థామస్ ల ‘ఐడెంటిటీ’ ట్రైలర్.. ఈ నెల 24న రిలీజ్..

Identity Trailer Talk: ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియా చిత్రాలు పెరిగాయి. రీసెంట్ గా మలయాళీ చిత్రం ‘మార్కో’ ప్యాన్ ఇండియా చిత్రం తెలుగు సహా హిందీలో ఇరగదీసింది.  ఈ నేపథ్యంలో మలయాళ చిత్రం తెలుగులో విడుదల  కాబోతుంది. అదే ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష,  టోవినో థామస్, లీడ్  పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిసున్నారు.

మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025లో తొలి మలయాళీ హిట్ చిత్రంగా నిలిచింది.  జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటర్ గా వ్యవహరించారు. మలయాళంలో హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు తో  కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు.  ఈ నెల 24వ తేదిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేడు హైదరాబాదులో చిత్ర యూనిట్ సమక్షంలో  ఈ మూవీ  తెలుగు టైలర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ... "ఐడెంటిటీ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చామన్నారు. ఈ మూవీ మలయాళంలో జనవరి 2వ తేదీన విడుదలై ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి సమయానికి ఇక్కడ సినిమాలు ఉండటంవల్ల అదే సమయంలో విడుదల చేయలేకపోయాము. అందుకే ఈనెల 24వ తేదీన విడుదల చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందన్నారు.  

 

ఈ ట్రైలర్ ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లా  కనిపిస్తోంది. విమానం హైజాక్ నేపథ్యంలో ఒక దుండగుడి ఐడెంటిటీని ఒక వ్యక్తి గుర్తు పెట్టుకొని.. స్కెచ్ ఆర్టిస్ట్ కు చెప్పడం.. దాన్ని అతను గీసి  సి ప్రభుత్వానికి పట్టించడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను అలరించడం పక్కా చెప్పొచ్చు..

చింతపల్లి రామారావు మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులుకు, స్నేహితులకి, సన్నిహితులకి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.  ఈ కొత్త యేడాదిలో  సంచలన వసూల్లతో మలయాలంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది ఐడెంటిటీ సినిమా. మామిడాల శ్రీనివాసరావుతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇది మలయాళ చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన వారు అలాగే ఈ సినిమాకు పనిచేసినవారు తెలుగునాట అందరికీ తెలిసివారే కావడం గమనార్హం.  

అఖిల్ పాల్ మాట్లాడుతూ... "ముందుగా మీడియా  వారందరికీ నా థాంక్స్. ఈ మూవీ తెలుగు ఆడియన్స్  ముందుకు రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలైనప్పటికి నుండి సుమారు రెండు మూడు యేళ్లుగా నాతో ప్రయాణం చేస్తున్న చిత్రహీరో  టోవినో థామస్. చిత్ర నిర్మాతలతో కలిసి ఆయన కూడా ఈ సినిమా కోసం నిలబడ్డారు. మలయాళం సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఈ చిత్రం బడ్జెట్ కొంచెం ఎక్కువైయిందన్నారు. ఈ చిత్రం ఎంతోమంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక సిబ్బంది ముందుకు వచ్చి పని చేశారు. తెలుగులో విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుందన్నారు.  

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

నటుడు వినయ్ రాయ్ మాట్లాడుతూ... "ముందుగా ఇక్కడ టైలర్ చూసి నన్ను ఎంత సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థాంక్స్.  రామారావు కి, శ్రీనివాసరావు కి ధన్యవాదాలు. తెలుగులో ప్రశాంత్ వర్మ నన్ను ప్రేక్షకులందరికీ ఎంతగా గుర్తుండిపోయిన చేశారో మలయాళం లో కూడా అఖిల్ ఆ స్థాయిలో నాకు గుర్తింపు వచ్చేలా చేశారన్నారు.  నా 18 యేళ్ల కెరియర్ లో ఇటువంటి కథను నేను ఎప్పుడు వినలేదు. ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, మంచి స్టోరీ లైన్ ఇలా అన్నీ బాగా కుదిరాయి.  ఈ చిత్రం తెలుగువారికి నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.  జనవరి 24వ తేదీన ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News