Rahul Ramakrishna: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ కమెడియన్!

Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్​ రామకృష్ణ మూవీలవర్స్ కు షాక్​ ఇచ్చారు. సినిమాలకు గుడ్​బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. 2022 వరకు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని తెలిపారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2022, 12:08 PM IST
  • రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం
  • సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కమెడియన్
Rahul Ramakrishna: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ కమెడియన్!

Rahul Ramakrishna: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). కమెడియన్ గా రాణిస్తూ..దూసుకుపోతున్న ఈ నటుడు అనుహ్య నిర్ణయం తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇక పై తాను సినిమాల్లో నటించనని.. 2022 వరకు మాత్రమే తాను మూవీల్లో నటిస్తానని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆకస్మాత్తుగా రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

2014లో 'సైన్మా' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు రాహుల్ రామకృష్ణ. 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన రాహుల్​.. 'అర్జున్​ రెడ్డి' (Arjun Reddy)తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'జాతిరత్నాలు', 'గీతాగోవిందం', 'హుషారు', 'బ్రోచేవారెవరురా', 'కల్కి', 'స్కైలాబ్'​ సహా పలు చిత్రాల్లో నటించి అభిమానుల్లో క్రేజ్​ సంపాదించుకున్నారు. తాజాగా జనం ముందుకు వచ్చిన ‘గుడ్ లక్ సఖి’ (Good Luck Sakhi) లోనూ రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించాడు. తాజాగా ఆయన నటించిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్, విరాటపర్వం వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

Also Read: Trolls on Allu Arjun: అల్లు అర్జున్.. దక్షిణాది సినిమాని ఇంత దిగజార్చుతావా! ఓ అభిమానిగా సిగ్గుపడుతున్నా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News