Singer Harika Narayan Marriage: ప్రియుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆర్ఆర్ఆర్ సింగర్..

Singer Harika Narayan Marriage: టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్‌ తన ప్రేమికుడైన పృథ్వీ వెంపటిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడేళ్లుగా వీళ్లిద్దరు ప్రేమించుకుంటారు. ఎట్టకేలకు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పంచి వీళ్లిద్దరు ఒకటయ్యారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2024, 11:02 AM IST
Singer Harika Narayan Marriage: ప్రియుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆర్ఆర్ఆర్ సింగర్..

Singer Harika Narayan Marriage: సినీ ఇండస్ట్రీలో హీరోల నుంచి ఇతర 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన ఒక్కొక్కరుగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. తాజాగా తెలుగులో తన గాత్రంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని హారికా నారాయణ్ కూడా పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. రీసెంట్‌గా మార్చి 6న పూలు పండ్లు (నిశ్చితార్ధం) చేసుకున్న ఈమె.. రెండు వారాల్లోనే ప్రియుడితో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచింది. చాలా సింపుల్‌గా జరిగిన ఈ వివాహా వేడుకలో బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రేవంత్ హాజరయ్యాడు.ఈ క్రమంలో కొత్తగా వివాహా బంధంలో అడుగుపెట్టిన జంటకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.  

హారికా నారాయణ్ విషయానికొస్తే.. తెలుగులో ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, బింబిసార వంటి సినిమాల్లో తన గాత్రంతో ప్రేక్షకులను అరలించింది. తాజాగా ఈమె తన ప్రియుడు పృథ్వీని పెళ్లి చేసుకుంది. ఈమె నిహారిక హీరోయిన్‌గా నటించిన 'సూర్య కాంతం' సినిమాతో గాయనిగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా క్రేజీ బిగ్ ప్రాజెక్ట్ సినిమాల్లో పాటలు పాడుతూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎత్తర జెండా పాటను విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, కీరవాణి, సాహితిలతో కలిసి ఆలపించింది.

హారికా నారాయణ్ విషయానికొస్తే.. ఆమె తండ్రి తూర్పు గోదావరికి చెందిన వారు. ఈయన ఎయిర్‌ ఫోర్స్ లో పనిచేసారు. ఆ తర్వాత ఉత్తరాదిలో పెరిగింది. ముఖ్యంగా మహేశ్ బాబు, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఇంట్రో సాంగ్స్‌తో పాపులర్ అయింది.  

ఇదీ చదవండి: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News