Pawan Kalyan: సినిమాలపై పవన్‌ కల్యాణ్‌ సంచలన ప్రకటన.. ఓజీ సినిమాపై ఏం చెప్పారంటే?

Pawan Kalyan Update On OG Movie When He Available: పాలనలో.. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తన సినిమాలపై సంచలన ప్రకటన చేశారు. తన ఓజీ సినిమాపై కీలక అప్‌డేట్‌ ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 3, 2024, 07:09 PM IST
Pawan Kalyan: సినిమాలపై పవన్‌ కల్యాణ్‌ సంచలన ప్రకటన.. ఓజీ సినిమాపై ఏం చెప్పారంటే?

Pawan Kalan OG Update: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా.. పాలనాపరంగా ఫుల్‌ బిజీలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సినిమాలను వదిలేశారా? అనే చర్చ జరుగుతోంది. ఆయన చేతిలో ఉన్న సినిమాలు ఆగిపోయాయా? అని అభిమానులు ఆందోళన చెందుతున్న వేళ పవర్‌ స్టార్‌ సంచలన ప్రకటన చేశారు. 'మాట ఇచ్చాం కదా! చేయాలి కదా. సినిమాలు పూర్తి చేస్తా' అని ప్రకటించారు.

Also Read: Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ కల్యాణ్‌ తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. బహిరంగ సభ వేదికన పవన్‌ తన సినిమాల విషయంపై ప్రస్తావించారు. అక్కడ హాజరైన అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. సినిమాల విషయమై ప్రస్తావిస్తూ.. 'సినిమాలు చేసే టైం ఉందంటారా' అని ప్రశ్నించారు. 'ఎలాగైనా మాట ఇచ్చాం కాబట్టి కనీసం మూడు నెలలైనా పనులు చేస్తాం. కనీసం రోడ్లు, గుంతలు వేయిస్తా. మీరు తిట్టుకోకుండా సేవ చేస్తా' అని పవన్ తెలిపారు.

Also Read: Mahesh Babu: అభిమాని పాలిట మహేశ్‌ బాబు దేవుడు.. పేదింట చదువుల వెలుగులు నింపిన సూపర్‌స్టార్‌

 

ఓజీపై ఏమన్నారు?
'మా నిర్మాతలకు కూడా ఇదే విషయం చెప్పాను. వారిని క్షమించమని కోరా. మా ఆంధ్ర ప్రజలు ఇచ్చిన బాధ్యతతో కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు అలా సమయం ఇస్తాను అని చెప్పా. చూద్దురు కానీ ఓజీ బాగుంటుంది' అని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్‌ అభిమానుల్లో ఉత్సాహం ఏర్పడింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News