క్యాట్ ( Kat ) గా ముద్దుగా పిలిపించుకునే కత్రినా కైఫ్ ( Katrina Kaif ) పుట్టినరోజు జూలై 16. కరోనా సంక్షోభ సమయంలో హౌస్ క్లీనింగ్ వీడియోలు, వంట టిప్స్, వంటపాత్రల క్లీనింగ్ వంటివాటితో లైమ్ లైట్ లో వచ్చిన క్యాట్ గురించి మీలో ఎవరికీ తెలియని ఆసక్తి కర విషయాలు.
బాలీవుడ్ కు బార్బిడాల్ ( Bollywood Borbydoll ) గా అభిమానులకు క్యాట్ గా సుపరిచితమైన పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ పుట్టిన రోజు ఇవాళ. కరోనా సంక్షోభ సమయాన్ని విభిన్నమైన వీడియోలు షేర్ చేస్తూ ప్రత్యేకతను చాటుకుంది కత్రినా. ముఖ్యంగా వంట టిప్స్, వంట పాత్రల క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ వీడియోలతో లైమ్ లైట్ లో వచ్చింది. ఈ వీడియోలు అభిమానుల్లో ఆమెకు ప్రత్యేకత సాధించిపెట్టాయి. అక్షయ్ కుమార్ తో కత్రినా నటించిన సూర్యవంశీ ( Suryavanshi ) విడుదలకు సిద్ధంగా ఉంది. Also read: HIT Hindi remake: బాలీవుడ్లో మన ‘హిట్’
ఆమె పుట్టినరోజు సందర్బంగా చాలామందికి తెలియని కొన్నినిజాలు ఇవే. ఆమె అసలు పేరు కత్రినా టర్కోట్ ( Katrina Turquotte ). హాంగ్ కాంగ్ లో పుట్టిన ఈమె చాలా దేశాల్లో నివసించింది.ఈమెకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు తోబుట్టువులు ( Katrina’s siblings ) . Also read: Apsara Rani: థ్రిల్లర్ మూవీలో సరికొత్త హాట్ స్టిల్స్
లండన్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ప్రముఖ ఫిల్మ్ మేకర్ కైజాద్ గుస్తాద్ ( Kaizad Gustad ) కత్రినాను పరిచయం చేశారు. హిందీతో పాటు ఆమె తెలుగు, మళయాలం సినిమాల్లో కూడా నటించింది. Also read: చీరకట్టులో అప్సర అందాలు చూశారా?
కత్రినా నటించిన ఏక్ థా టైగర్ ( Ek tha Tiger ), టైగర్ జిందా హై ( Tiger Zinda hai ), ధూమ్ 3 ( Dhoom 3 ), భారత్ ( Bharat ) సినిమాలు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలుగా ఉన్నాయి. తరచూ కత్రినా తల్లితో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. Also read: Shakuntala Devi Trailer: నేను కరెక్ట్.. కంప్యూటరే రాంగ్.. శకుంతలా దేవీ ట్రైలర్ విడుదల