Tamannaah NBK 108 : అనిల్ రావిపూడితో గొడవలు.. ఎంతో బాధగా ఉందంటూ తమన్నా క్లారిటీ

Tamannaah in NBK 108 Movie Item Song తమన్నా తాజాగా ఓ ట్వీట్ వేసింది. అందులో తన మీద వస్తోన్న రూమర్లను ఖండించింది. అయితే తమన్నా ఇప్పుడు వేసిన ట్వీట్‌తో మళ్లీ ఎఫ్‌ 3 నాటి గొడవలు కూడా చర్చల్లోకి వచ్చేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2023, 10:03 AM IST
  • నెట్టింట్లో తమన్నా ట్వీట్ వైరల్
  • అనిల్ రావిపూడితో తమన్నా గొడవలు
  • బాధగా ఉందంటూ మిల్కీ బ్యూటీ ట్వీట్
Tamannaah NBK 108 : అనిల్ రావిపూడితో గొడవలు.. ఎంతో బాధగా ఉందంటూ తమన్నా క్లారిటీ

Tamannaah in NBK 108 Movie బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో ఓ ఐటం సాంగ్ ఉందని, ఆ పాటలో నటించేందుకు తమన్నాను అనిల్ రావిపూడి అడిగాడని, అయితే తమన్నా ఒప్పుకోలేదని, ఎఫ్ 3 సమయంలో జరిగిన గొడవలు ఇంకా మరిచిపోలేదని, అందుకే తమన్నా ఆ పాటను అంగీకరించలేదని కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆ రూమర్లను ఖండిస్తూ తమన్నా ట్వీట్ వేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఎఫ్ 3 సమయంలో తమన్నాకు అనిల్ రావిపూడి మధ్య గ్యాప్ వచ్చింది. అడిగిన డేట్స్ ఇచ్చిన తమన్నా.. చివర్లో కాస్త అడ్జస్ట్ చేయలేకపోయిందట. ఓ స్పెషల్ పాటకు తమన్నా ఎక్స్ ట్రా డేట్లను కేటాయించలేకపోయిందట. దీంతో తమన్నా, అనిల్ రావిపూడి మధ్య చిన్న వాగ్వాదం జరిగిందని అప్పట్లో రూమర్లు వచ్చాయి. అవేమీ పెద్ద గొడవలు కావని అనిల్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్ 3 ప్రమోషన్స్‌లో తమన్నా కనిపించకపోవడంతో ఆ రూమర్లు మరింతగా ఎక్కువయ్యాయి.

 

ఇప్పుడు తమన్నాను అనిల్ రావిపూడి మళ్లీ అడిగాడట. బాలయ్యతో చేస్తోన్న సినిమాలో ఐటం సాంగ్ ఉందట. అందులో నర్తించేందుకు తమన్నా అంగీకరించలేదని రూమర్లు వచ్చాయి. దీనిపై తమన్నా ఇప్పుడు స్పందించింది. అనిల్ రావిపూడి సర్‌తో పని చేయడం నాకు ఎప్పుడూ ఆనందమే.. ఎంజాయ్ చేస్తూ పని చేస్తాను.. నందమూరి బాలకృష్ణ సర్ అన్నా, అనిల్ రావిపూడి సర్ అన్నా నాకు ఎంతో గౌరవం.. వాళ్ల కొత్త సినిమా విషయంలో ఇలాంటి నిరాధారమైన వార్తలను చూసి నాకు ఎంతో బాధగా అనిపించింది.. ఏదైనా రాసేటప్పుడు కాస్త రీసెర్చ్ చేసి రాయండి అని చెప్పుకొచ్చింది.

Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్

అనిల్ రావిపూడి బాలయ్య సినిమా కోసం ఇప్పుడు ఓ హీరోయిన్‌ను వెతుకుతున్నారట. ఆ స్పెషల్ సాంగ్‌ను త్వరలోనే షూట్ చేయబోతోన్నారట. ఈ పాట కోసం శ్రుతి హాసన్‌ను కూడా సంప్రదించినట్టుగా సమాచారం. మరి ఏ హీరోయిన్ ఫిక్స్ అవుతుందో చూడాలి. శ్రుతి హాసన్ ఈ మధ్యే బాలయ్యతో వీర సింహా రెడ్డి సినిమాలో కలిసి ఆడిపాడిన సంగతి తెలిసిందే

Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News