Sukumar Associates Becoming Successful in Tollywood: సాధారణంగా స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు తర్వాత అసోసియేట్లుగా మారతారు, ఆ తరువాత కో డైరెక్టర్లుగా మారతారు. ఆ తర్వాత సినిమా దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకుంటారు. సాధారణంగా ఒకప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఫాలో అవుతున్న ఫార్ములా అయితే ఇద. కానీ ఇప్పుడు విదేశాల్లో సహా హైదరాబాదులో కూడా ఫిలిం మేకింగ్ ఇన్స్టిట్యూట్ లు పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చిన నేపథ్యంలో డైరెక్షన్లో కూడా కోచింగ్ తీసుకుని డైరెక్టర్లుగా మారుతున్న వారు కొందరు ఉన్నారు.
అలాంటి వారిలో సక్సెస్ అయిన వారు కూడా ఎక్కువమంది ఉన్నారు. అయినా సరే సంప్రదాయబద్ధంగా ఒక దర్శకుడు దగ్గర సినిమా మేకింగ్ లో మెళకువలు నేర్చుకుని తర్వాత దర్శకత్వం వహిస్తున్న వారు బాగా రాణిస్తున్న దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో సుకుమార్ శిష్యులు అందరూ జెండా పాతే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.
గతంలో సుకుమార్ శిష్యుడు హరిప్రసాద్ జక్కా కూడా కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు సుకుమార్ కి సంబంధించిన మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులు చాలా కాలం పాటు మాట్లాడుకోబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే సాయి ధరంతేజ్ హీరోగా రూపొందుతున్న విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కూడా సుకుమార్ స్కూల్లోని శిష్యుడే. సుకుమార్ దగ్గర కొన్ని సినిమాలుకు పనిచేసిన ఆయన ఇప్పుడు విరూపాక్ష అనే డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇక వీరు మాత్రమే కాదు మరో ముగ్గురు నలుగురు సుకుమార్ శిష్యులు కూడా త్వరలోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినీ రంగ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారందరికీ అవసరమైతే తానే కథలు ఇచ్చి దర్శకులుగా చేయడానికి కూడా సుకుమార్ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తన దగ్గర టాలెంటెడ్ శిష్యులు ఉంటే బయటకు పంపకుండా వారిని కొన్నాళ్లపాటు తన దగ్గరే ఉంచుకుని వాడుకునే గురువులు ఉంటారు. కానీ సుకుమార్ మాత్రం తన శిష్యులు జీవితంలో మరింత ముందుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.
Also Read: Ram Gopal Varma Complaint: యూనివర్సిటీ స్పీచ్ వివాదం..వాళ్లపై తిరిగి కేసు పెడతానంటున్న వర్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook