Rajamouli Maha Bharat: జక్కన్న మహాభారతం ఎప్పుడో చెప్పిన తండ్రి, ఎన్ని భాగాలంటే

Rajamouli Maha Bharat: తెలుగు ప్రేక్షకులకే కాదు మొత్తం అందరికీ కావల్సిన మహా భారత్ త్వరలో బాహుబలి జక్కన్న చేతులతో రూపుదిద్దుకోనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అపురూప ఘట్టం ఎప్పుడో తెలిసిపోయింది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 11, 2023, 01:04 AM IST
Rajamouli Maha Bharat: జక్కన్న మహాభారతం ఎప్పుడో చెప్పిన తండ్రి, ఎన్ని భాగాలంటే

Rajamouli Maha Bharat: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ విఖ్యాతి పొందిన దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చేతుల్లో త్వరలో మహాభారత్ రూపుదిద్దుకోనుంది. మహాభారత్‌కు కధ అందించనున్న జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని హింట్స్ ఇచ్చేశారు. అంటే మహాభారత్ ఎప్పుడు ప్రారంభమయ్యేది పరోక్షంగా చెప్పారు. 

దాదాపు పదేళ్ల క్రితం మహాభారతంపై సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా రాజమౌళి అభివర్ణించినప్పటి నుంచి దేశప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మహాభారత్ సినిమా డ్రీమ్ ప్రాజెక్టు అని బాహుబలి కంటే ముందే ప్రకటించాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలను చూసిన ప్రేక్షకులకు జక్కన్న చేతిలో మహాభారత్ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఊహించుకోగలుగుతున్నారు. శ్రీ రాముడి ఇతివృత్తంతో ఇటీవల బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ డిజాస్టర్ కావడంతో  రాజమౌళి తెరకెక్కించనున్న మహాభారత్ గురించి చర్చ ప్రారంభమైంది. మహాభారత్ సినిమాను 3-4 భాగాలుగా తీస్తేనే సరిగ్గా సెట్ అవుతుందని లేకుంటే అసంపూర్తిగా ఉంటుందని గతంలో రాజమౌళి స్వయంగా చెప్పిన పరిస్థితి. అంటే రాజమౌళి లెక్కల్లో చెప్పాలంటే ఓ పదేళ్లకు పైనే పట్టవచ్చేమో.

ఈ నేపధ్యంలో మహాభారత్ ప్రాజెక్టు గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా పూర్తయ్యాక అంటే వచ్చే ఏడాది మహాభారత్ సినిమా పనలు ప్రారంభం కావచ్చని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేశ్‌తో చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్‌ను మించి ఉంటుందని చెప్పిన విజయేంద్ర ప్రసాద్ త్వరలో ఆర్ఆర్ఆర్ 2 ఉంటుందని తెలిపారు. అంటే ఇంకో రెండేళ్ల కాలవ్యవధిలో మహాభారత్ సినిమాకు జక్కన్న సిద్ధం కానున్నాడు.

Also read: Mahesh Babu - Rajamouli: ఆ నెలలోనే ప్రారంభం కానున్న మహేష్ బాబు - రాజమౌళి సినిమా..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News