RRR trail shoot: రాజమౌళికి పోలీసులు షాక్ ఇచ్చారా ?

RRR movie | క‌రోనావైరస్ ( Coronavirus) వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్ డౌన్ ( Lockdown) విధించిన కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈమధ్యే చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసి సినిమాల షూటింగ్స్‌కి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. 

Last Updated : Jun 19, 2020, 02:00 AM IST
RRR trail shoot: రాజమౌళికి పోలీసులు షాక్ ఇచ్చారా ?

Coronavirus: క‌రోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్‌డౌన్ ( Lockdown) విధించిన కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈమధ్యే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నేతృత్వంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసి సినిమాల షూటింగ్స్‌కి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. తెలంగాణలో సినిమా షూటింగ్స్ జరుపుకోవడానికి వెంటనే అనుమతి లభించినప్పటికీ.. ఏపీలో మాత్రం జూలై నెలలో అనుమతులు ఇస్తామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. షూటింగ్స్‌కి అనుమతి మంజూరు చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సైతం పలు షరతులు విధించింది. సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing) లక్ష్యం దెబ్బతినకుండా.. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం స్పష్టంచేసింది. నిహారిక మరో ట్విస్ట్.. కాబోయే భర్త ముఖం చూపించవా! )

ఏదైతేనేం తెలంగాణ సర్కార్ నుంచి అనుమతి లభించింది కదా అని భావించిన ప్రముఖ దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli).. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో ఎన్టీఆర్, చరణ్‌ల స్థానంలో డూప్స్‌ని పెట్టి రెండు రోజుల పాటు ట్రయల్ షూట్ ( RRR movie trail shoot)  చేయాలని నిర్ణయించుకున్నాడట. అలా చేయడం వల్ల షూటింగ్‌లో తలెత్తే ఇబ్బందులను ఆ తర్వాత అధిగమించేందుకు అవకాశం ఉంటుందనేది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది. 

ఆర్ఆర్ఆర్ మూవీ ట్రయల్ షూట్ కోసం సర్వం సిద్ధం చేసుకున్న రాజమౌళికి పోలీసుల నుండే ఇంకా అనుమ‌తులు రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ... ఏదైనా ఒక లొకేషన్‌లో సినిమాను షూట్ చేసేటప్పుడు.. అక్కడి పోలీసుల అనుమతి తప్పనిసరి అనే విషయం తెలిసిందే. అలా ఇప్పుడు షూటింగ్ కోసం సర్వం సిద్ధం చేసుకున్న రాజమౌళి కూడా చివరిగా పోలీసుల అనుమతి కోసం వేచిచూస్తున్నారని ఫిలింనగర్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా పోలీసుల నుంచి పూర్తిస్థాయిలో అనుమతి రావడానికి కనీసం ఇంకో రెండు రోజులైనా పట్టొచ్చనేది ఆ టాక్ సారాంశం.  హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News