Sree leela Lineup: మహేష్, పవన్, దేవరకొండ సహా ఏడుగురు హీరోల సినిమాలు లైన్లో పెట్టిన శ్రీలీల

Sree leela Crazy Movies Lineup: చేసిన రెండు సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న శ్రీలీల ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతోంది, ఆమె ఏకంగా 7 సినిమాలను లైన్లో పెట్టినట్టు చెబుతున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 3, 2023, 04:51 PM IST
Sree leela Lineup: మహేష్, పవన్, దేవరకొండ సహా ఏడుగురు హీరోల సినిమాలు లైన్లో పెట్టిన శ్రీలీల

Sree leela 7 Movies as Heroine: తెలుగమ్మాయి అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది శ్రీ లీల. కన్నడలో కొన్ని సినిమాలు చేసిన ఆమె తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమాని గౌరీ రోనంకి తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా దక్కించుకున్న సూపర్ క్రేజ్ తో శ్రీ లీల వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

ఈ సినిమా తర్వాత శ్రీ లీల ఇప్పటికే ధమాకా సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె ఏకంగా ఏడు సినిమాలు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈరోజు ఆమె విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా ఓపెనింగ్ జరిగిన నేపద్యంలో మొత్తం ఏడు సినిమాల లిస్ట్ ఏమిటి? ఏ ఏ హీరోతో ఆమె నటిస్తోంది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. విజయ్ దేవరకొండ 12వ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది.

Also Read: Pushpa 2 Issues: ఐదు రోజుల ఐటీ రైడ్స్.. ఎట్టకేలకు క్లియర్ అయిన పుష్ప2 సమస్యలు!

మరోపక్క నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది హీరోయిన్ పాత్ర కాకపోయినా బాలకృష్ణ కుమార్తె పాత్ర అనే ప్రచారం అయితే ముందు నుంచి జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.

ఇప్పటికే హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుండగా ఆమెకు సమాంతరమైన పాత్రలో ఈ భామ కూడా నటిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే విధంగా రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా స్త్రీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇవి కాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న 32వ సినిమా పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న నాలుగో సినిమా ప్రాజెక్టుల్లో కూడా ఈ భామ భాగం అవుతుంది. ఇలా టాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలు చేస్తున్న ఈ భామ ఇప్పుడు గంటల్లో లెక్క రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.

Also Read: Jagapathi Babu: రజినీకాంత్ ఏం మాట్లాడినా పర్ఫెక్ట్.. వైసీపీ వివాదంపై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News