Ram Charan RC15 Look : శంకర్ దిల్ రాజులకు మళ్లీ దెబ్బ.. రామ్ చరణ్ లుక్ లీక్.. వీడియో వైరల్

Ram Charan in Rajahmundry Latest Schedule రామ్ చరణ్ తాజాగా ఏపీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజమండ్రి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ షూటింగ్ ప్రారంభించేసిన శంకర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 07:23 PM IST
  • ఏపీలో అడుగు పెట్టిన రామ్ చరణ్
  • శరవేగంగా RC 15 షూటింగ్
  • మళ్లీ లుక్ లీక్ అవ్వడంతో వీడియో వైరల్
Ram Charan RC15 Look : శంకర్ దిల్ రాజులకు మళ్లీ దెబ్బ.. రామ్ చరణ్ లుక్ లీక్.. వీడియో వైరల్

Ram Charan in Rajahmundry Latest Schedule రామ్ చరణ్ శంకర్ సినిమా మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడల్లా కూడా శంకర్‌ అండ్ దిల్ రాజు టీంకు చుక్కలు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ లుక్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇట్టే లీక్ అవుతున్నాయి. రాజకీయ నాయకుడిలా పంచె కట్టిన లుక్కులో రామ్  చరణ్ పిక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఎక్కడ షూటింగ్ చేసినా కూడా రామ్ చరణ్‌ లుక్స్ మాత్రం బయటకు వచ్చేస్తున్నాయి.

 

దిల్ రాజు టీం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా రామ్ చరణ్‌ లుక్స్ మాత్రం ఇలా లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజమండ్రిలో దిగిన రామ్ చరణ్ సెట్స్ మీదకు వచ్చాడు. అయితే మళ్లీ పంచెకట్టు లుక్కులో కనిపించాడు. షూటింగ్ స్పాట్ వద్దకు జనాలు తండోపతండాలుగా వచ్చినట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్‌ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

దీంతో రామ్ చరణ్ బౌన్సర్లు, అక్కడి పోలీస్ అధికారుల సమక్షంలో మెగా పవర్ స్టార్‌ను జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. అయితే ఈ సమయంలోనే కొందరు రామ్ చరణ్‌ను వీడియో తీసినట్టు కనిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్‌ తన మొహం కనిపించకుండా మొహానికి కర్చీప్ కట్టుకున్నాడు. లుక్ బయటకు రాకుండా కట్టుకున్నాడా? లేదంటే అక్కడి దుమ్ము పడకుండా కట్టుకున్నాడా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read : Geetha Madhuri Husband : గుర్తు పట్టలేనంతగా మారిన గీతూ మాధురి భర్త.. లుక్ బాలేదంటూ కష్టాన్ని గుర్తించని నెటిజన్లు

Also Read : Rashmika Mandanna Dating : రష్మిక ప్రస్తుత దుస్థితికి కారణం విజయ్ దేవరకొండనా?.. వేణు స్వామి కామెంట్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News