Varun Lavanya Reception: రంగ రంగ వైభవంగా వరుణ్ లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన సెలబ్రిటీస్

Varun and Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠీల పెళ్లి నవంబర్ 1న ఇటలీ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులకు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జంట తిరిగి హైదరాబాద్ వచ్చాక నిన్న మిగతా వారందరికీ మెగా కుటుంబం ఒక పెద్ద రిసెప్షన్ అరేంజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2023, 09:38 AM IST
Varun Lavanya Reception: రంగ రంగ వైభవంగా వరుణ్ లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన సెలబ్రిటీస్

 Varun-Lavanya Reception: మెగా హీరో వరుణ్ తేజ్, టాలెంటెడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమా లో కలిసి హీరో హీరోయిన్లు గా నటించారు. అప్పట్లో మొదలైన వారి పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. చాలాకాలం పాటు మీడియా ముందు కూడా ఒప్పుకోకుండా తప్పించుకున్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9వ తేదీన నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా బయటపెట్టారు.

తాజాగా నవంబర్ 1న వీరి పెళ్లి ఇటలీలో జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ అలానే అల్లు ఫ్యామిలీ వారు అటెండ్ అయ్యారు. ఇక నిన్న ఆదివారం నాడు హైదరాబాద్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.

నవంబర్ 1 న పెళ్లి పూర్తయిన తర్వాత నవంబర్ మూడవ తేదీన కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెగా అభిమానులు వారిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఇక నిన్న ఆదివారం సాయంత్రం అనగా నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.

ఈ రిసెప్షన్ కు మెగా ఫ్యామిలీ అలానే అల్లు ఫ్యామిలీ సభ్యులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

హీరోల విషయానికి వస్తే.. వెంకటేష్, నాగ చైతన్య, రోషన్ మేక, జయసుధ, సందీప్ కిషన్, అడివి శేష్, రాజేంద్ర ప్రసాద్, రీతూ వర్మ, సుశాంత్, జగపతి బాబు, కార్తికేయ, అలీ, సునీల్, మురళీ మోహన్, ఉత్తేజ్, సుబ్బరాజు, ప్రియదర్శి, నవదీప్, అభినవ్ గోమతం, ప్రిన్స్, ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్, ఆశిష్ రెడ్డి, తేజ సజ్జ, సత్యదేవ్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhushan Mn (@bhushan.mn)

ఈ కార్యక్రమంలో దర్శకులు సుకుమార్, బాబీ, ప్రవీణ్ సత్తారు, కళ్యాణ్ కృష్ణ, బోయపాటి శ్రీనివాస్, గుణశేఖర్, సంపత్ నంది, వీఎన్ ఆదిత్య, వెంకీ అట్లూరి, సాయి రాజేష్, శ్రీనివాస్ అవసరాల, కృష్ణ చైతన్య, వశిష్ట, కరుణ కుమార్, కౌశిక్ పెగళ్లపాటి తదితరులు పాల్గొన్నారు. 

నిర్మాతలు మైత్రి రవి, దిల్ రాజు, మైత్రి మూవీ చెర్రీ, సుబ్బిరామిరెడ్డి, శివలంక కృష్ణ ప్రసాద్, బన్నీ వాస్, నాగ వంశీ, బెల్లంకొండ సురేష్, అశ్విని దత్, స్వప్న దత్, విష్ణు ఇందూరి, బృందా ఇందూరి, వివేక్ కూచిభొట్ల, పీపుల్ మీడియా విశ్వ ప్రసాద్, అల్లు బాబీ, నల్లమలపు బుజ్జి హాజరయ్యారు.

ఇక సుమ, రోషన్, శ్రీనివాస్ రెడ్డి, సైనా నెహ్వాల్, చోటా కె నాయుడు, డిఓపి - జ్ఞానశేఖర్, ఆనంద్ సాయి కుటుంబం, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది వంటి ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రేమ జంటను ఆశీర్వదించారు.

Also Read: Caste Census: ఏపీలో నవంబర్ 20 నుంచి కుల గణన ప్రారంభం, ఎలా జరుగుతుందంటే

Also Read: Chandrababu-Pawan Meet: చంద్రబాబు-పవన్ భేటీ, మేనిఫెస్టోపై చర్చ, మరోసారి పోటీ అక్కడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News