Rashmika Mandanna : చాలా రోజులకు ఇంటికి వెళ్లిన రష్మిక.. అక్కడ చేసిన పనులివే

Rashmika Mandanna Went To Home రష్మిక మందాన్న అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన డైరీని రాస్తూ దినచర్య గురించి చెబుతుంటుంది. రోజంతా ఎలా గడిచిందో వివరిస్తూ ఉంటుంది. అయితే చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఇప్పుడు డైరీ రాసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 06:49 PM IST
  • డైరీ రాసిన రష్మిక మందాన్న
  • ఇంటికి వెళ్లి అల్లరి చేసిన హీరోయిన్
  • రోజంతా సరదాగా గడిచిందన్న రష్మిక
Rashmika Mandanna : చాలా రోజులకు ఇంటికి వెళ్లిన రష్మిక.. అక్కడ చేసిన పనులివే

Rashmika Mandanna Dairy నేషనల్ క్రష్ రష్మిక మందాన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సినిమాల కంటే.. కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటుంది. ఈ మధ్య కాలంలో రష్మిక మందాన్న మీద ఎక్కువగా వివాదాలు వచ్చాయి. కన్నడ ఇండస్ట్రీ ఆమె మీద బ్యాన్ విధించిందనే రూమర్లు కూడా వచ్చాయి. కాంతారా, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి విషయంలో ఆమె ప్రవర్తించిన తీరుకు కాంట్రవర్సీలు వచ్చాయి.

ఇక తన మీద వచ్చే ట్రోలింగ్, నెగెటివిటీ మీద కూడా రష్మిక స్పందించింది. నేను చూసినా తప్పే చూడకపోయినా తప్పే అన్నట్టుగా మాట్లాడుతుంటారు.. అలాంటప్పుడు నేనేం చేయాలో చెప్పండి.. అదే చేస్తాను అంటూ ట్రోలర్‌లకు పంచ్ వేసింది. ట్రోలింగ్ అనేది తన వరకు వస్తే పర్లేదు గానీ.. తన ఫ్యామిలీని కూడా ట్రోల్ చేస్తున్నారంటూ అది నచ్చడం లేదంటూ రష్మిక వాపోయింది.

తాజాగా రష్మిక ఇంటికి వెళ్లిందట. చాలా రోజుల తరువాత ఇంటికి వెళ్లడంతో ఇలా ఎంజాయ్ చేశాను అంటూ రష్మిక తన డైరీ గురించి చెప్పేసింది. అందులో ఏముందంటే.. డియర్ డైరీ.. ఫిబ్రవరి 4న జరిగింది ఇదే.. ఇలా డైరీ రాయక చాలా రోజులైంది.. కానీ ఈ ఒక్క విషయం మాత్రమే చెప్పగలను.. నిన్న అంతా కూడా అద్భుతంగా సాగింది.. కానీ అదంతా ఈ రోజు రాయాలని అనుకుంటున్నాను.. లేవగానే నా చెల్లి నా బెడ్డు మీద దొర్లుతూ కనిపించింది.. బయటి పని మీద వెళ్లాల్సి ఉండేది.. కానీ మా అమ్మ బలవంతం మీద ఇంటికి వెళ్లాను..పూజ చేశాను.. అలా అయినా మా వాళ్లని చూశాను అనే ఆనందం కలిగింది.

ఇక ఇంటికి వెళ్తే నేను ఎంతో బద్దకస్తురాలిగా అవుతాను.. ఇంటికి వెళ్లిన తరువాత ఏ పని చేయలేదు.. చెల్లికి ముద్దులు పెడుతూనే ఉన్నాను.. మమ్మితో ముచ్చట్లు పెడుతూనే ఉన్నాను.. డాడీతో బిజినెస్ గురించి చర్చలు పెట్టాను.. ఇక రాత్రి పూట గొడవలు పెట్టేసుకున్నాం.. ఆ తరువాత హైద్రాబాద్‌కు ఫ్లైట్‌లో తిరిగి వచ్చాను.. అద్భుతంగా గడిచింది కదా? అంటూ రష్మిక తన అభిమానులను అడేగిసింది.

Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News