Ram Charan New friend: కొత్త ఫ్రెండ్ ను పరిచయం చేసిన రామ్‍చరణ్, ఫోటోలు వైరల్

Ram Charan New friend:  మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తన కొత్త ఫ్రెండ్‍ను పరిచయం చేశారు. ఇంతకీ ఆ కొత్త ప్రెండ్ ఎవరో మీకు తెలుసుకోవాలనుందా?

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2023, 09:38 PM IST
Ram Charan New friend:  కొత్త ఫ్రెండ్ ను పరిచయం చేసిన రామ్‍చరణ్, ఫోటోలు వైరల్

Ram Charan New friend:  గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే చరణ్ కు గుర్రాలంటే ఎంతో ఇష్టమో మనందరికీ తెలిసిందే. చెర్రీ మగధీర సినిమా నుంచి హార్స్ పై మక్కువ పెంచుకున్నాడు. ఆ సినిమా కోసం హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నాడు. అప్పటి నుంచి కొన్ని గుర్రాలను కూడా పెంచుకుంటున్నాడు. తాజాగా తన కొత్త స్నేహితుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రామ్‍చరణ్. ఇంతకీ ఆ కొత్త మిత్రుడెవరో మీకు క్లారిటీ వచ్చేసే ఉంటుంది. రీసెంట్ గా రామ్‍చరణ్ ఓ బ్లాక్ హార్స్‌ను తెచ్చుకున్నారు. దానికి బ్లేజ్ అని పేరు పెట్టారు. తాజాగా దీనితో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు చెర్రీ. 

ఇక గేమ్‌ ఛేంజర్ విషయానికొస్తే.. ఇది పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ , ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మరోవైపు చరణ్ ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనిని RC16 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ రాబోతుంది. ఇ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌, మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.  ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Also Read: Tiger Nageswara Rao Trailer: టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ వచ్చేసింది.. మాస్ మహారాజ విశ్వరూపం చూసేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News