Rakul Preet Photoshoot : ప్రమోషన్స్‌ కోసం అంతా తెరబెట్టేసిన రకుల్.. ఇక మొదలు అంటూ నెట్టింట్లో సందడి

Rakul Preet Singh For Chhatriwali రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చేపట్టినట్టు ప్రకటించింది. దీని కోసం రకుల్ చేసిన ఫోటో సెషన్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 09:40 PM IST
  • నెట్టింట్లో రకుల్ ప్రీత్ సందడి
  • ఓటీటీలో సందడి చేయనున్న ఛత్రివాలి
  • రకుల్ ప్రీత్ ఫోటో షూట్ వైరల్
Rakul Preet Photoshoot : ప్రమోషన్స్‌ కోసం అంతా తెరబెట్టేసిన రకుల్.. ఇక మొదలు అంటూ నెట్టింట్లో సందడి

Rakul Preet Singh Chhatriwali రకుల్ ప్రీత్‌ను హీరోయిన్‌గా చాన్స్ ఇచ్చి, స్టార్ హీరోయిన్‌గా చేసింది తెలుగు పరిశ్రమ. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో రకుల్ ప్రీత్ హిట్ కొట్టేసింది. అలా రకుల్ ప్రీత్ జర్నీ తెలుగులో బాగానే ఆరంభం అయింది. అయితే అనతి కాలంలోనే రకుల్ ప్రీత్ మంచి ఫాంలోకి వచ్చింది.

తెలుగులోని టాప్ హీరోలందరితోనూ నటించేసింది. మహేష్‌ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ ఇలా అందరితోనూ నటించింది. బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది. స్టార్ హీరోలతో నటిస్తూనే కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసింది. రకుల్‌కు టాలీవుడ్‌తో పాటుగా కోలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది.

రకుల్ ప్రీత్ ఎక్కువగా సినిమాలతో ఫేమస్ అయినా కూడా.. వివాదాలే ఆమెను ఎక్కువగా పాపులర్ చేశాయి. రకరకాల రూమర్లు రకుల్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆమెకు ఓ స్టార్ హీరో స్పెషల్‌గా ఇళ్లు కొనిచ్చాడంటూ రూమర్లు వచ్చాయి. దీంతో రకుల్ మండిపడింది. తన సొంత కష్టంతో సంపాదించుకున్న డబ్బులతోనే కొనుకున్నానని, ఎవరో ఎందుకు గిఫ్ట్‌గా ఇస్తారంటూ రకుల్ చెప్పుకొచ్చింది.

ఇక రకుల్ మంచు లక్ష్మీ ఫ్రెండ్ షిప్ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది. ఈ ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా పోజులు పెట్టి ఫోటోలు దిగుతుంటారు. దీంతో వీరి మీద జనాలు దారుణమైన కామెంట్లు చేస్తుంటారు. రకుల్, మంచు లక్ష్మీలు ఎక్కువగా వెకేషన్‌లలో తిరుగుతుంటారు.

సోషల్ మీడియాలో ఇక రకుల్ ప్రీత్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ట్రోలర్లకు రకుల్ ప్రీత్ గట్టిగా కౌంటర్లు ఇస్తుంటుంది. రకుల్ ప్రీత్ ఒక్కోసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటుంది. దీంతో మరింతగా నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తుంటారు.

రకుల్ తాజాగా తన ఛత్రివాలి సినిమా జీ5లోకి రాబోతోందంటూ చెబుతూ ప్రమోషనల్ స్టంట్ చేసింది. దీని కోసం సపరేట్‌గా ఫోటో షూట్ చేసింది. అందులో తన ఎద అందాలను బహిర్గత పర్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News