Rakul Preet Singh : రకుల్ ఇంట్లో విషాదం.. నీతో పాటే పెరిగా.. 16 ఏళ్ల బంధం.. హీరోయిన్ ఎమోషనల్

Rakul Preet Singh Emotional రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో రకుల్ చెప్పిన విషయాలు అందరినీ ఏడిపించేస్తున్నాయి. ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పెట్ కన్నమూసిందని చెబుతూ ఎమోషనల్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2022, 03:55 PM IST
  • రకుల్ ప్రీత్ ఇంట్లో విషాదం
  • పెంచుకున్న పెట్‌ మరణం
  • రకుల్ ప్రీత్ ఎమోషనల్ పోస్ట్
Rakul Preet Singh : రకుల్ ఇంట్లో విషాదం.. నీతో పాటే పెరిగా.. 16 ఏళ్ల బంధం.. హీరోయిన్ ఎమోషనల్

Rakul Preet Singh Pet Death : రకుల్ ప్రీత్ ఇంట్లో విషాదం నెలకొంది. పదహారేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చిన పెట్ మరణించడంతో రకుల్ వెక్కి వెక్కి ఏడ్చినట్టుగా కనిపిస్తోంది. తనకు తన పెట్ మీదున్న ప్రేమను కురిపిస్తూ వేసిన పోస్ట్ అందరినీ కదిలిసిస్తోంది. తన పెట్ బ్లాసమ్ చనిపోయిందని, గుండె పగిలినట్టుగా అయిపోయిందంటూ రకుల్ వేసిన పోస్ట్ అందరినీ ఏడిపించేస్తోంది. ఇంతకి రకుల్‌ వేసిన పోస్ట్‌లో ఏముందంటే?..

బ్లాసమ్.. మా జీవితాల్లోకి నువ్ పదహారేళ్ల క్రితం వచ్చావ్.. మా జీవితాల్లోకి సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చావ్.. నిన్ను ఇకపై ఎంతగానో మిస్ అవుతుంటాం.. నువ్ ఎంతో చక్కని జీవితాన్ని గడిపావ్.. వెళ్లే ముందు కూడా ఎలాంటి బాధలు లేకుండా వెళ్లిపోయావ్.. నాకు ఎంతో సంతోషంగా ఉంది.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నువ్ ఎక్కడున్నా బాగుండాలి అంటూ రకుల్ వేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెట్‌తో రకుల్‌కు ఉన్న బంధం తెలిసేలా పాత ఫోటోలన్నీ షేర్ చేసింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

నిన్న గాక మొన్న రకుల్ తన లవర్ జాకీ భగ్నానీ బర్త్ డే అంటూ స్పెషల్‌ పోస్ట్ వేసింది. శాంటా ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నువ్వే.. నా జీవితంలోకి ఆనందాన్ని, మనశ్శాంతిని తీసుకొచ్చావ్ అంటూ ఇలా తన ప్రియుడు మీద పోస్ట్ వేసింది. ఇంతలో ఇప్పుడు ఇలాంటి విషాదభరితమైన పోస్ట్ వేయాల్సి వచ్చింది.

రకుల్‌కు ఈ ఏడాది టాలీవుడ్‌లో అంతగా కలిసి రాలేదు. ఆమె చేసిన కొండపొలం సినిమా ఆకట్టుకోలేకపోయింది. రకుల్‌కు ఇప్పుడు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఆమె కూడా బాలీవుడ్‌ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తమిళంలోనూ రకుల్ సినిమాలు చేస్తున్నట్టుగా ఉంది. కానీ తెలుగులో మాత్రం ఆమెకు ఆఫర్లు రావడం లేనట్టు తెలుస్తోంది.

Also Read : Pawan Kalyan Unstoppable : పేరు తెలీదు అన్నోడే పడిగాపులు కాసేలా.. పవన్ బాలయ్య మీటింగ్‌పై మంట పెట్టిన మెగా ఫ్యాన్ ట్వీట్

Also Read : Sudigali Sudheer Love : ఊపిరి ఉన్నంత వరకు ఆమెనే ప్రేమిస్తుంటా.. అసలు విషయం చెబుతూ ఫోటోను చూపించిన సుడిగాలి సుధీర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News