Pushpa 2 Update: పుష్ప 2 క్రేజీ అప్ డేట్.. ఇంతకీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ఎక్కడంటే?

Pushpa 2 Movie Update: టాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో 'పుష్ప 2' కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2023, 07:07 AM IST
Pushpa 2 Update: పుష్ప 2 క్రేజీ అప్ డేట్.. ఇంతకీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ఎక్కడంటే?

Pushpa The Rule Update: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'పుష్ప 2' కూడా ఒకటి. 'పుష్ప.. ది రూల్‌'గా(Pushpa The Rule) తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి చాలా రోజులగా ఎటువంటి అప్ డేట్ లేదు. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది. పుష్ప.. ది రూల్ షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్ రామోజీఫిలింసిటీలో మెుదలుకానుందట. అల్లు అర్జున్‌తోపాటు కీలక నటీనటులపై వచ్చే సీన్స్ ను ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీక్వెల్ లో  ఫహద్‌ ఫాసిల్‌ మెయిన్‌ విలన్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. 

రెండో పార్టులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌-ఫహద్ ఫాసిల్‌ మధ్య వచ్చే నాలుగు యాక్షన్‌ సన్నివేశాలు, జగపతిబాబుతో వచ్చే ఒక యాక్షన్‌ సీన్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉండబోతుందని టాక్. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను హాలీవుడ్‌కు చెందిన టీం పర్యవేక్షణలో షూట్ చేయబోతున్నారట. పుష్ప 2 కు రాక్ స్టార్ దేవిశీప్రసాద్ సంగీతం అందించనున్నారు. 

అల్లు అర్జున్(Allu Arjun) టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై సుకుమార్ (Sukumar)‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక పుష్ప ది రూల్‌ కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అవుతున్నట్టు రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో సంచనాలను సృష్టించిన ఐకాన్ స్టార్.. రెండో పార్టుతో ఎలాంటి రికార్డ్సు క్రియేట్ చేస్తాడో చూడాలి. 

Also Read: Devil Movie: కళ్యాణ్ రామ్ 'డెవిల్' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News