Ramu Passes Away: కరోనాతో ప్రముఖ నిర్మాత, Actress Malashree భర్త రాము కన్నుమూత

Actress Malashree Husband Ramu Passes Away| కరోనా మహమ్మారి పలువురు సెలబ్రిటీల జీవితంలోనూ పెను విషాదాన్ని నింపింది. తాజాగా ప్రముఖ నిర్మాతను బలిగొంది. సీనియర్ నటి మాలాశ్రీ భర్త, ప్రముఖ నిర్మాత రాము కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 27, 2021, 02:54 PM IST
  • ఇటీవల కరోనా బారిన పడిన కన్నడ సినీ నిర్మాత రాము
  • చికిత్స పొందుతూ బెంగళూరులోని ఆసుపత్రిలో కన్నుమూత
  • టాలీవుడ్ నటి మాలాశ్రీ భర్త మరణంపై ప్రముఖుల సంతాపం
Ramu Passes Away: కరోనాతో ప్రముఖ నిర్మాత, Actress Malashree భర్త రాము కన్నుమూత

Kannada Film Producer Ramu Passes Away: సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ పలువురు ప్రముఖులను కబలించింది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత అధికం అవుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ పెంచుతున్నా, మరోవైపు కోవిడ్19 పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ నిర్మాత, టాలీవుడ్ నటి మాలాశ్రీ భర్త రాము(52) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు.

ఇటీవల నిర్మాత రాముకు కరోనా పాజిటివ్ అని తేలడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మూడు రోజులపాటు కోవిడ్19 మహమ్మారితో పోరాడిన నిర్మాత రాము సోమవారం సాయంత్రం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. గంగ, ఏకే 47, ఆటో శంకర్, కంఠీరవ లాంటి సూపర్ హిట్ సినిమాలను రాము నిర్మించారు. పలు హిట్ చిత్రాలు నిర్మించిన రాము ఇకలేరన్న విషయాన్ని కన్నడ సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. పలువురు సినీ ప్రముఖులు రాము మరణం పట్ల సంతాపం ప్రకటించారు. నిర్మాత రాము, నటి మాలాశ్రీ దంపతులకు సంతానం ఇద్దరు పిల్లలు అనన్య, ఆర్యన్ ఉన్నారు.

Also Read: Mohan Babu: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న నటుడు మోహన్ బాబు, ప్రజలకు విజ్ఞప్తి

నటి మాలాశ్రీ 1990 దశకంలో కన్నడ, తెలుగు సినీ పరిశ్రమలలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రేమ ఖైదీ, బావమరిది, తోడికోడళ్లు, బంగారు మొగుడు , పోలీస్ అల్లుడు, సాహసవీరుడు సాగరకన్య, చాముండి, సూర్యపుత్రులు వంటి సూపర్ హిట్ టాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించింది. కన్నడలోనూ సినిమాలు చేయడంతో అక్కడి నిర్మాత రామును వివాహం చేసుకుని కర్ణాటకకు పరిమితమైంది. వివాహం అనంతరం కన్నడ సినిమాలు చేసిన మాలాశ్రీ 2015లో ఉత్తమ నటిగా కర్ణాటక అవార్డు అందుకుంది.

Also Read: Mahesh Babu in isolation: ఐసోలేషన్‌లో మహేష్ బాబు.. ఆ తర్వాతే సర్కారు వారి పాట షూటింగ్ ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News