ప్రకాశ్ రాజ్ సర్జరీ విజయవంతం..'డెవిల్ ఈజ్ బ్యాక్' అంటూ…ట్వీట్!

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజు ఇటీవల ఓ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా తనకు సర్జరీ విజయవంతమైనట్లు ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2021, 11:42 AM IST
  • ప్రకాశ్ రాజ్ సర్జరీ విజయవంతం
  • 'డెవిల్ ఈజ్ బ్యాక్' అంటూ…ట్వీట్
  • త్వరలోనే నటిస్తానని వెల్లడి
ప్రకాశ్ రాజ్ సర్జరీ విజయవంతం..'డెవిల్ ఈజ్ బ్యాక్' అంటూ…ట్వీట్!

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు శస్త్రచికిత్స విజయవంతం అయింది. ఇటీవల ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ ఆయన సర్జరీ కోసం హైదరాబాద్ కు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

తాజాగా తాను గాయం నుండి కోలుకున్నట్లు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ట్విట్టర్(Twitter) ద్వారా వెల్లడించారు. తనకు సర్జరీ అయిన ఫోటోను ట్వీట్ చేసిన ఆయన.. 'ది డెవిల్ ఈజ్ బ్యాక్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సర్జరీ చేసిన డాక్టర్ గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

Also Read: ప్రకాశ్ రాజ్‌కు గాయం.. సర్జరీ కోసం హైదరాబాద్‌కు పయనం!

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే.. 'మా' (MAA Elections) ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధ్యక్ష ప‌ద‌వి కోసం ప్రకాష్ రాజ్‌‌తో పాటు హీరో మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, నటి హేమ పోటీలో ఉన్నారు. దీంతో మా(MAA) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని తెలుస్తోంది.

ఇటీవల నటి హేమ..ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్(Naresh)పై కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. దీంతో నరేష్ క్రమ శిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్(Prakash Raj) నటుడిగా వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు. తెలుగులో కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నారు. అలానే పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న 'లైగర్' సినిమాలోనూ చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News