Vakeel Saab Re Release: థియేటర్స్‌లో రీ రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ..

Vakeel Saab Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో ఓల్డ్ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడమనేది కామన్ అయిపోయింది. తాజాగా ఈ కోవలో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ 'వకీల్ సాబ్' మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 27, 2024, 10:12 AM IST
Vakeel Saab Re Release: థియేటర్స్‌లో రీ రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ..

Vakeel Saab Re Release: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొని ఉంది. మరోవైపు ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అందరి మూడదానిపైనే ఉంది. దీంతో బడా హీరోలు సినిమాలకు పీక్ సీజనైన సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పాత సినిమాలనే మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' మూవీని మే 1 రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకపుడు తెలుగులో పాత సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేసేవారు. కొన్నిసార్లు మొదటిసారి విడుదలైనపుడు నడవని చిత్రాలు రీ రిలీజ్‌లో కుమ్ముసేవి. ఇక శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వాటి దూకుడు తగ్గింది. ఇపుడు మళ్లీ ఇపుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ మొదలైంది.

పవన్ కళ్యాణ్‌ నటించిన 'వకీల్ సాబ్' మూవీ కరోనా పాండమిక్ టైమ్‌లో విడుదలై మంచి వసూళ్లనే సాధించింది. రీసెంట్‌గా ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది. హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన 'పింక్' చిత్రాన్ని తెలుగు నేటివిటీ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు పలు మార్పులు చేర్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసారు. దిల్ రాజు నిర్మించారు.

ఈ సినిమా తొలి రోజే.. రూ. 52.50 కోట్లు రాబట్టి సంచలనం రేపింది. కరోనా పాండమిక్ లేకపోయి ఉన్నట్టైయితే ఈ సినిమా మరిన్ని వసూళ్లను సాధించి ఉండేది. ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ముఖ్యపాత్రల్లో నటించారు.  శృతి హాసన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 85.67 కోట్ల షేర్ (రూ. 140 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా కరోనా టైమ్‌లో ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన ఈ సినిమా ఇపుడు రీ రిలీజ్‌లో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Also Read: Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News