"ఆక్సిజన్" ఆడియో రిలీజ్ డేటు ఖరారు

            

Last Updated : Oct 15, 2017, 03:39 PM IST
"ఆక్సిజన్" ఆడియో రిలీజ్ డేటు ఖరారు

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో నిర్మితమైన యాక్షన్ మూవీ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. పూర్తిస్థాయి సాంకేతికతతో కూడిన కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆడియోను  ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రంలో జగపతిబాబు ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. గోవా, సిక్కిం లాంటి రాష్ట్రాలలో ఈ చిత్రం షూటింగ్‌ను జరుపుకుంది. ఛోటే కే నాయుడు ఈ చిత్రానికి కెమెరామ్యాన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ సాయిరాం క్రియేషన్స్‌తో పాటు ఎ.ఎం.రత్నం కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహించారు. 

Trending News