Neti Bharatam: టాలీవుడ్‌లో మరో అద్భుతం.. ఒకే పాత్ర‌తో తెరకెక్కుతోన్న 'నేటి భార‌తం'...

Neti Bharatam: టాలీవుడ్ సహా అన్ని ఇండస్డ్రీస్‌లో హీరోలు ప్రయోగాలు చేయడాకికీ వెనకాడటం లేదు. అంతేకాదు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడటం లేదు. ఈ కోవలో ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కుతున్న చిత్రం 'నేటి భారతం'.

Last Updated : Feb 18, 2024, 09:44 AM IST
Neti Bharatam: టాలీవుడ్‌లో మరో అద్భుతం.. ఒకే పాత్ర‌తో తెరకెక్కుతోన్న 'నేటి భార‌తం'...

Neti Bharatam: ప్రస్తుతం మన హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒకే ఒక క్యారెక్టర్‌తో మంచి సోషల్ మెసెజ్‌తో తెరకెక్కుతోన్న చి్తరం 'నేటి భారతం'. భరత్ పారేపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. డాక్టర్ యర్రా  డా.య‌ర్రా శ్రీధ‌ర్ రాజు న‌టిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఇదే ఒక్క క్యారెక్టర్‌తో మోహన్ లాల్ హీరోగా నటించిన 'ఎలోన్' మూవీ తెరకెక్కింది. అదే తరహాలు కొన్ని హిందీ చిత్రాలు వచ్చాయి. తెలుగులో ఈ కాన్సెప్ట్‌తో చిత్రం రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్ర‌స్తుతం  ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. త్వరలో విడుదల తేది ప్రకటించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.

ఈ సంద‌ర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత  సాంబేష్ మాట్లాడుతూ...`నిర్మాత డా. శ్రీధ‌ర్ రాజు  సినిమా ఇండ‌స్ట్రీకి మంచి చిత్రాలు చేయాల‌ని ఉద్దేశ్యంతో వచ్చారు. అందులో భాగంగానే  తొలి సినిమాగా `మేరా భార‌త్ మ‌హాన్ అనే  మంచి సబ్జెక్ట్ ఉన్న చిత్రం చేశారు. ఈ మూవీకి  మంచి పేరొచ్చింది. ప్ర‌స్తుతం ఒకే పాత్ర‌తో శ్రీధ‌ర్ ' 'నేటి భార‌తం' సినిమాను తెరకెక్కించారు. ప్ర‌స్తుతం ఉన్న పొలిటిక్స్ కారణాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరారు.  

వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ...`శ్రీధ‌ర్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమా చూశాను. స‌మాజంలో ఉన్న అసమాన‌త‌ల‌పై  ప్ర‌తి మనిషిక కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాన్నారు.

న‌టుడు కమ్ నిర్మాత డా. య‌ర్రా శ్రీధ‌ర్ రాజు మాట్లాడుతూ...`క‌రోనా త‌ర్వాత వ‌చ్చిన ఆర్థిక‌, సామాజిక స్థితి గ‌తుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మన సమాజంలో జరిగిన కొన్ని చిత్ర, విచిత్రంగా ఈ సినిమా తెరకెక్కించారు. ముఖ్యంగా పాలసీ మేకింగ్ తో  పాటు ఆ పాల‌సీల వెన‌కాల రాజ‌కీయ నాయ‌కులు స్వార్థాలు, వాటి అమ‌లు తీరు ఇలా ప‌లు సోష‌ల్ ఇష్యూస్ పై  మా 'నేటి భార‌తం' చిత్రం చేశామన్నారు. కీర్తి శేషులు పెద్దాడ‌మూర్తి  ఈ చిత్రానికి అద్భుత‌మైన మాట‌లు, పాట‌లు అందించారు. ఈ సినిమాలో  నేను జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించాను. దీనికి తెర‌వెనుక హీరో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ పారేప‌ల్లి అని చెప్పాలి. త‌న‌తో నేను విద్య‌, వైద్యం మీద మేరాభార‌త్ మ‌హాన్ అనే చిత్రం చేశాను. దానికి మంచి పేరొచ్చింది. అందులో నేను మంచి పాత్ర‌లో న‌టించా. ఆ ఇన్ స్పిరేష‌న్ తో ఒకే పాత్ర‌తో నేటి భార‌తం చిత్రం చేశానని చెప్పారు. ఈ చిత్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాజ‌ధాని ఇష్యూతో పాటు,  విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సున్నిత‌మైన అంశాల గురించి కూడా చ‌ర్చించామన్నారు. మా ట్రైల‌ర్ చూసి ఎంతో ఇన్ స్పైర్ అయిన  చంద్ర‌బాబు నాయుడు  మా చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డమే కాకుండా మా టీమ్ ని ఎంతో  అభినందించారు.  దీనికి కార‌ణ‌మైన క‌ర్నూల్ కి చెందిన ఎమ్మెల్సీ  బీటీ నాయుడుకి  ఈ సందర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియజేసారు. ఏ వ్య‌క్తిని కించ‌ప‌ర‌చ‌కుండా కేవ‌లం పాల‌సీ మేకింగ్ గురించి మాత్ర‌మే మా చిత్రంలో చూపించామన్నారు. జ‌ర్న‌లిస్టుల అంకిత‌భావం, తెగింపు మా చిత్రంలో చూపిస్తున్నాం. ఒక మంచి కాన్సెప్ట్ తో సింగిల్ క్యారెక్ట‌ర్ తో వ‌స్తోన్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని  కోరుకుంటున్ననన్నారు.
దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ నేటి భారతం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. శ్రీధర్ రాజు అద్భుతమైన నటన కనబరిచారు.

Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News