Prabhas: కల్కి తర్వాత ఏకంగా ఆరు భారీ సినిమాలు.. ఆశ్చర్యపరుస్తున్న రెబల్ స్టార్

Kalki 2898AD: ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకే.. కాదు పాన్ ఇండియాపరంగా.. సినీ అభిమానులు ఎవరికి.. పరిచయాలు అవసరం లేదు. బాహుబలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన.. ఈ హీరో కల్కి.. సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారుm ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్.. తదుపరి సినిమాల గురించి ఒక అప్డేట్ వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటుంది 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 2, 2024, 10:00 PM IST
Prabhas: కల్కి తర్వాత ఏకంగా ఆరు భారీ సినిమాలు.. ఆశ్చర్యపరుస్తున్న రెబల్ స్టార్

Prabhas Upcoming Movies: 

ఈశ్వర్ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్.. ఆ తర్వాత విడుదలైన వర్షం సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో.. వచ్చిన ఛత్రపతి సినిమా.. ప్రభాస్ కెరియర్ ని మార్చేసింది. ప్రభాస్ ని టాలీవుడ్ లో.. స్టార్ హీరోగా మార్చింది. అయితే మరోసారి రాజమౌళితో.. చేసిన బాహుబలి సినిమా.. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ గా స్టార్ హీరోగా నిలబెట్టింది. బాహుబలి సినిమా తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అంటే తెలియని వారు.. ఎవరు లేకుండా పోయారు. అంతటి క్రేజ్.. తెచ్చి పెట్టింది.. ఈ చిత్రం. ఇక అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు.. చేస్తూ.. దూసుకుపోతున్నారు ఈ హీరో.

ఇక ఈ మధ్య విడుదలైన కల్కి సినిమా ప్రభాస్ కెరియర్ లో.. మరో బ్లాక్ బస్టర్ ని నమోదు చేసేలా.
ముందుకెళ్తోందిహ 500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం.. ఏకంగా 1000 కోట్ల దిశకు పరుగులు తీస్తోంది.  ఈ క్రమంలో ఈ సినిమా తరువాత ప్రభాస్ తదుపరి చిత్రాలపై.. మరింత ఆసక్తి నెలకొంది. కాగా ప్రభాస్ రాబోతున్న చిత్రాల గురించి.. ఒక వార్త వైరల్ అవుతూ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది 

అదేమిటంటే ప్రభాస్ చేతిలో ఆల్మోస్ట్ అరడజను సినిమాలు ఉన్నాయి. కాగా అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఈ మధ్యనే విడుదలైన ప్రభాస్ సలార్ సినిమా కూడా మంచి విజయం అందుకున్న.. సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలోనే రాబోతోంది. మరోపక్క ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ ఆల్రెడీ సగం అయిపోయిందని సమాచారం. త్వరలో రాజా సాబ్ షూట్ మొదలుపెట్టి ..రెండు నెలల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.  

ఇక రాజా సాబ్ తర్వాత.. సీతారామం సినిమాతో.. బ్లాక్ బస్టర్ అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి.. ఆల్రెడీ సెట్ వర్క్ జరుగుతోంది. మూడు పాటలు కూడా రెడీ అయినట్టు ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

ఆ తర్వాత కల్కి కి కొనసాగింపుగా రాబోతున్న ‘కల్కి 2’ సినిమా షూట్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు. కల్కి 2 ఆల్రెడీ 60 శాతం షూట్ అయింది అని.. ఈమధ్య నిర్మాత తెలిపాడు. మిగిలిన షూటింగ్ వచ్చే సంవత్సరం చేయనున్నట్టు ఇటీవల నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. 

కాగా వీటన్నిటితో పాటు ప్రభాస్ యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ.. కాంబోలో ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ చేసారు. ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. వచ్చే సంవత్సరం షూట్ మొదలుపెడతారని ఇటీవల.. సందీప్ రెడ్డి వంగ తెలిపాడు. వీటన్నిటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా ఉందని గతంలో ప్రకటించారు. ఇలా ఏకంగా.. ఆరు పాన్ ఇండియా సినిమాలతో.. అందరి స్టార్ హీరోలని మించి బిజీగా ఉన్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. ఏ పాన్ ఇండియా స్టార్ హీరో చేతిలో కూడా ఇన్ని సినిమాలు లేకపోవడం గమనార్హం.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News